Vastu Tips : వాస్తు ప్రకారం ఏ మొక్కలు ఏ దిశలో పెంచితే అదృష్టం పడుతుందో తెలుసుకోండి!!

Vastu Tips :  పచ్చని మొక్కలు మన ఇంటికి అందాన్నే కాదు, మన మనస్సులకు ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయి. అదే వాస్తు శాస్త్రం చెప్పిన మొక్కలు కూడా పెంచుకుంటే అదృష్టం కూడా కలిసివస్తుంది. వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని రకాల మొక్కలను నాటడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలా జరిగితేఇంట్లో డబ్బుకి కొరత అనేది ఉండదు. అలాంటి కొన్ని మొక్కలు గురించి తెలుసుకుందాం.

Find out which plants are grown in which direction according to Vastu to bring good luck
Find out which plants are grown in which direction according to Vastu to bring good luck

కొబ్బరి చెట్టు:
వాస్తు శాస్త్రం చెప్పిన దాని ప్రకారం, ఇంట్లో ఒక కొబ్బరి చెట్టును నాటడం మంచి అభివృద్ధికి కారణం అవుతుంది.

వేప చెట్టు:
ఇంట్లో ఒక వేప చెట్టు ఉంటే ఔషదాల గని ఉన్నట్టే. వాస్తు ప్రకారం చూసుకుంటే ఇది శుభప్రదమైనది కూడా. వేప చెట్టుని ఇంటి వాయువ్య మూలలో పెంచుకోవాలి. దాని నుండి వీచే గాలి మాస్టర్ బెడ్‌రూమ్ కిటికీల నుండి లోనికి రావడం అనేది ఆరోగ్యానికి మాత్రమే కాదు ఆర్ధికంగా కూడా చాలా మంచిది.

స్నేక్ ప్లాంట్:
వాస్తు శాస్త్రం లో చెప్పినదాని ప్రకారం, ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుకోవడం వల్ల ఆనందం , శ్రేయస్సు కలుగుతుంది. ఈ మొక్క చాలా పవిత్రమైనది అని కూడా భావిస్తారు. దీన్ని మీ స్టడీ రూమ్‌లోపెట్టుకోవడం వల్ల మీ పురోగతికి చక్కని మార్గం ఏర్పడుతుంది.

అత్తిపత్తి … అత్తిపత్తి మొక్క చాలా పవిత్రమైనదిగా చెప్పబడింది.వాస్తు శాస్త్రం లో చెప్పినదాని ప్రకారం ఈ మొక్కను ఈశాన్య దిశలో నాటి రోజూ నీళ్లు పోస్తూ ఉండడం వల్ల జాతకంలో రాహువు దోషం పోతుంది.

లక్ష్మణ మొక్క…
ఇంట్లో లక్ష్మణ మొక్క ఉండడం వలన ఆర్థిక సమస్యలు ఉండవనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ మొక్కలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అనే నమ్మకం ఉంది. ఈ మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటుకోవాలి.

అలాగే పువ్వులు దేవుడు పూజకు మాత్రమే కాదు ఆ మొక్కలు పెంచుకోవడం వలన ఇంటి ప్రశాంతత కి కారణం అవుతాయి అని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మందార మొక్కలను పెంచుకోవాలి అనుకున్నప్పుడు తూర్పు , ఉత్తర దిశలో నాటుకోవడం వలన మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.

ఇక గులాబీ మొక్కల విషయానికి వస్తే అవి ఇంట్లో సానుకూల శక్తి ప్రసరించేలా చేస్తాయి. గులాబీ మొక్కలను నైరుతి దిశలో పెంచుకోవడం మంచిదని సూచించ బడినది.

తామర పువ్వులు పూచే ఏర్పాటు ఇంట్లో చేసుకోవడం వల్ల ఆనందం తో పాటు శ్రేయస్సు కలుగుతుంది. ఈ తామర పూల మొక్కలను ఇళ్లల్లో పెంచుకునేటప్పుడు ఈశాన్యదిశ లో కానీ ఉత్తర దిశ లో కానీ పెంచుకోవడం మంచిది.