Pattabhi :టిడిపి జాతీయ ప్రధానంగా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోపం వచ్చింది. అన్ని ఇలాగే చేస్తాడంటూ ఆగ్రహం, ఆ సహనం వ్యక్తం చేయడంతో పాటు ముందే దూరం పెట్టి ఉంటే పార్టీ ఇంతగా బ్రష్టు పట్టి ఉండేది కాదు అని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గన్నవరం విధ్వంసంపై చంద్రబాబు పేరిట ప్రజలకు విడుదల చేసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో మాట వరసకైనా పట్టాభి పేరును ప్రస్తావించ లేకపోవటం పరిశీలించదగిన అంశం..
గన్నవరం విధ్వంసం ప్రజలకు బహిరంగ లేక అంటూ చంద్రబాబు పేరిట ఇదివరకే పార్టీ విడుదల చేసింది. నాలుగు పేజీల లేఖలో పట్టాభిరామ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. గన్నవరం టిడిపి నేత పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న పేరు మాత్రం రెండుసార్లు ప్రస్తావించారు. దీన్ని బట్టి పట్టాభి విషయంలో పార్టీ ఎలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటుందో స్పష్టంగా అర్థం అవుతుంది.
విజయవాడలో చెందిన మరో నాయకుడు పట్టాభిరామ్ వ్యవహారిక శైలిని జిల్లా నాయకుల ద్వారా స్పష్టంగా తెలుసుకున్న నేపథ్యంలో
.. గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేషన్ కమిటీ అధిష్టానం మాజీ ఎంపీ కొనికళ్ల నారాయణ ను తక్షణం నియమించినట్లు తెలుస్తోంది. పట్టాభిరామ్ గురించి తెలియాల్సిన అంశాలన్నీ చంద్రబాబుకి ఇప్పుడిప్పుడే తెలిసి వచ్చాయని.. అతను గతంలో విదేశాలకు వెళ్లి పార్టీ పేరు అడ్డం పెట్టుకొని పలు ప్రయోజనాలు పొందాలని కూడా చంద్రబాబు తెలుసుకున్నారు. అయితే ఆ విషయాలన్నీ ఇప్పుడిప్పుడే చంద్రబాబుకు తెలిసి ఆయనే అందుకే చంద్రబాబు పట్టాభిని దూరం పెడుతున్నారని.. దాంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని సమాచారం.. మరోవైపు తన కొడుకు చేస్తున్న యువగళం పాదయాత్ర ప్రజల్లోకి వెళ్ళకపోగా పట్టాభి వలన అనవసరంగా నెగిటివ్ ఇంప్రెషన్ ప్రజల్లో క్రియేట్ అయిందని చంద్రబాబు ఆలోచనలో పడ్డారట.
మరోవైపు పట్టాభి టిడిపి కోసం జైలు పాలు అయితే.. పట్టాభి పేరును లేఖలో ప్రస్తావించక పోగా.. ఆయన పైనే టిడిపి అధినేత చంద్రబాబు గుర్తుగా ఉండటం చూసి పట్టాభి ఎవరి కోసం అయితే జైలుకు వెళ్ళాడో వాళ్ళే తనని పట్టించుకోవడం లేదని మరికొంత మంది అనుకుంటున్నారు.