Rashmika Mandanna : కన్నడ భామ రష్మిక మందన నిన్న జరిగిన జీ సినిమా అవార్డులు 2023 వేడుకలలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.. నిన్న కన్నడ సోయగం సోకుల విందు చేసింది. చిట్టి పొట్టి గౌనులో కనిపించి చూపు తిప్పుకొనివ్వకుండా చేసింది ఈ బ్యూటీ..
రష్మిక స్లీవ్ లెస్ బ్లాక్ నెట్ షార్ట్ గౌన్ లో దర్శనమిచ్చింది. ఆ అవార్డు ఫంక్షన్లో భాగంగా కార్పెట్ పై నడిచిన రష్మిక సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె ఫోటోలపై రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా రేష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇండస్ట్రీకి పరి చయమైన దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది రష్మిక. ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తన సత్తా చాటుకుంటుంది. అమితాబచ్చన్ లీడ్ రోల్ లో వచ్చిన గుడ్ బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ను అందుకుంది. తాజాగా బెస్ట్ డెబ్యు ఫిమేల్ భాగంలో ఓ సిని అవార్డును కూడా గెలుచుకుంది రష్మిక. కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో తెరకు పరిచయమైన ఈ బ్యూటీ .. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుంది.. రష్మిక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ మూవీ యానిమల్ సినిమాలో కూడా నటిస్తోంది.