Bride Twist : గంటలో పెళ్లి రిసెప్షన్.. అంతలో ఫోన్ కాల్.. కట్ చేస్తే.. పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని ఏం చేశాడంటే.?

Bride Twist : చత్తీస్గడ్ రాయపూర్ కి చెందిన అస్లాం ఆహ్మద్ కి దూరపు బంధువైన భాను ను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 21 రాత్రి పెళ్లికూతురు తండ్రి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రాయపూర్ లోని ఓ భారీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు రాత్రి 7 గంటలకు దగ్గర బంధువులంతా ఆ ఫంక్షన్ హాల్ కి నాలుగు గంటల నుంచి చేరుకుంటూ ఉన్నారు. రిసెప్షన్ కి పెళ్లికూతుర్ని పెళ్ళికొడుకుని రెడీ చేయడానికి బ్యూటిషన్ రెడీగా ఉంది. పెళ్లికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు గదిలో ఏకాంతంగా సమయం గడుపుతున్నారు. దాంతో బ్యూటిషన్ ని వెయిట్ చేయమని చెప్పడంతో బ్యూటిషన్ ఏది బయటే వెయిట్ చేస్తూ ఉంది..

అప్పుడే అస్లాంకి ఒక ఫోన్ వచ్చింది. ఆ తరువాత అస్లాం భానుపై గట్టిగట్టుగా అరుస్తూ ఉన్నాడు. అప్పుడే బ్యూటిషన్ పెళ్లికూతురు బంధువుల దగ్గరికి వెళ్లి నేను భానుని రెడీ చేస్తాను పెళ్ళికొడుకుని బయటికి రమ్మని చెప్పండి అని అంటుంది. అప్పుడే బచావో బచావో అని భాను పెద్దగా అరుస్తుంది. ఆ మాటలకి అందరూ వెళ్లి తలుపు కొడతారు కానీ లోపల నుంచి ఏవేవో చప్పుడు శబ్దాలు తప్ప ఇంకేమీ వినిపించవు. తలుపులు వేసేసి ఉన్నాయి. కిటికీలోనుంచి చూద్దామంటే కటన్ వేసి ఉంది. ఆ రూము తలుపు బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆలోపే భాను రక్తపు మడుగులో ఉంటుంది. అస్లాం కూడా కత్తితో తనని పొడుచుకుంటూ కనిపిస్తాడు. వాళ్లు లోపలికి వచ్చే సమయానికి ఇద్దరూ చనిపోయి ఉంటారు.

అసలు అస్లాం వారిని ఎందుకు చంపాడు. అప్పటివరకు అస్లం బాగానే ఉండటం కూడా బ్యూటిషన్ కళ్ళారా చూసింది. కానీ ఒక ఫోన్ కాల్ తరువాతే ఒక గంటలోనే ఇద్దరు చనిపోయారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆరా తీశారు పోలీసులు. భాను తను అంతకుముందే ప్రేమాయణం నడిపిన వ్యక్తి అస్లాంకు ఫోన్ చేశాడు. అస్లాం కి కాస్త కోపం ఎక్కువ. ఏదైనా తనకు నచ్చని మాటలు తను వింతగా ప్రవర్తిస్తాడు. ముందు వెనుక ఏం ఆలోచించడు. విపరీతమైన కోపం తెచ్చుకుంటాడు.

భాను ఎవ్వరినీ ప్రేమించ లేదని చెబుతున్నా వినలేదు. తన మీద ఉన్న కోపంతో ఆ ఫోన్ లో విన్న మాటల కారణంగా భాను ప్రాణాలు తీయడంతో పాటు తన ప్రాణాన్ని కూడా తీసేసుకున్నాడు. భాను తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ కేసును విచారిస్తున్నారు. అప్పటివరకు బాగానే ఉన్న అస్లాం సైకో ప్రవర్తన కారణంగా భాను చనిపోయింది. పోలీసులు ఈ కేసు పై మరింత విచారణ చేస్తున్నారు.