LPG cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. సామాన్యులకు తిప్పలే..!

LPG cylinder Price: ప్రతినెలా ఒకటవ తారీఖున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మరొకసారి తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండూ కూడా పెరిగాయి. సుమారు 8 నెలల తర్వాత డొమెస్టిక్ సిలిండర్ ధర 50 రూపాయలు పెరగడం గమనార్హం.

LPG Cylinder Price (Jan 2021): How Much You Pay For LPG Cooking Gas Cylinder  Refill In New Year

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం 8 నెలల తర్వాత ఇదే మొదటిసారి.. హైదరాబాదులో గ్యాస్ సిలిండర్ ధరపై 50 రూపాయలు పెరిగింది. దీంతో రేటు తాజాగా రూ.1,155 కు చేరుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ ఎల్.పి.జి సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం అక్కడ రేటు రూ.1,161 గా వుంది. కాగా గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది . ఇప్పుడు సబ్సిడీ కూడా ఎత్తివేయడంతో సామాన్యుల జోబులకు భారీగా చిల్లు పడనుంది.