By Elections : ఆంధ్ర లో ఆ రెండు నియోజక వర్గాలలో ఉపఎన్నికలు??

By Elections : రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కొత్త ,కొత్త అంశాలలో వ్యూహాలు రచిస్తూ ముందుకు కదిలితేనే రాజకీయాల్లో తిరుగులేని స్థానం లో ఉండడం సాధ్యమవుతుంది.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి వైసీపీ వారు ఒక భారీ రాజకీయ వ్యూహాన్నీ అమలు చేసి తమ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న టీడీపీ, జనసేనలకు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సమాధానం చెప్పాలని నిర్ణయం తీసుకుంది.  అందుకోసం విశాఖ నార్త్ ఎమ్మెల్యే ,టీడీపీ మాజీ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రెండుసంవత్సరాల క్రిందటే రాజీనామా చేయడం, ఆ స్థానం ఇప్పటికి ఖాళీగా ఉండడం.. గంటా కూడా తన రాజీనామాను ఆమోదించమని తాజాగా కూడా డిమాండ్ చేయడం అందరికి తెలిసిందే. అయితే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఏ క్షణం లో రాజీనామా కు ఆమోదించిన గంటా శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే గా మారారతారు. ఈ అవకాశం తో విశాఖ నార్త్ లో ఉప ఎన్నికలు వస్తాయి. వైసీపీ విశాఖలో పాలనారాజధాని ఏర్పాటు చేయడం తో సహా మూడు రాజధానుల కోసం పోరాటం చేస్తుంది. దానిలో భాగంగానే చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేసారు కానీ ఇంకా ఆమోదం జరగలేదు. ఇప్పుడు ఈ రెండు రాజీనామాల ఆమోదం జరిగితే ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు వచ్చేఅవకాశం ఉందని భావిస్తున్నారు.

By-elections in those two constituencies in Andhra
By-elections in those two constituencies in Andhra

ఆ విధం గా ఎన్నికలు వచ్చేలా చేసి , ఆ రెండు చోట్లా వైసీపీ ని గెలిపించుకుంటే ఆ దెబ్బతో 2024 ఎన్నికల వరకు విపక్షాల కు చెక్ పెట్టవచ్చు అనే అంశం మీద వైసీపీ వ్యూహరచన చేస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. అయితే ఇప్పుడు విశాఖ నార్త్ కి ఉప ఎన్నిక నిర్వహిస్తే గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారా లేదా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఆయన పోటీ చేయడం తో పాటు జనసేన కూడా మద్దతు ఇస్తే మాత్రం ఆ రెండు పార్టీల సత్తా ఏమిటో తెలుసుకోవడానికి ఈ ఉప ఎన్నిక అధికార పార్టీకి బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అదేవిధంగా చోడవరం లో ఉప ఎన్నికను తెచ్చి, అక్కడ మూడు రాజధానుల నినాదాన్ని గట్టిగా వినిపించవచ్చు అని వైసీపీ ఆలోచిస్తుంది. ఇక్కడ కూడా పోటీ కి జనసేన ఉంటుందా ? లేదా టీడీపీ పోటీ చేస్తుందా అనికూడా చర్చకు వచ్చే విషయమే. ఇలా 2024 ఎన్నికల ముందే టీడీపీ, జనసేనపొత్తుల యొక్క బలం ఎంత? ఆ పార్టీల మధ్య పొత్తు ఎంతవరకు ఉంటుంది?అది వైసీపీ మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది?అనే అంశాలు తెలుసుకోవడానికి మాత్రమే వైసీపీ ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలను తెస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నెల లో విశాఖకు వస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ ముందు స్టీల్ ప్లాంట్ విషయాన్ని పెట్టి ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చేయాలి అని జగన్ వినతిని అందించే ఆలోచనలో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అనుకూలం గా స్పందిస్తే మాత్రం ఈ ఉప ఎన్నికల ఆలోచన ఉండదని, పరిస్థితి వ్యతిరేకం గా ఉంటే మాత్రం ప్రధాని పర్యటన తర్వాత వైసీపీ గంటా శ్రీనివాస్ రాజీనమా సీరియస్ గా తీసుకుని ముందడుగు వేస్తుంది అని అంటున్నారు. ఉపఎన్నికల పేరుతో జనసేన, టీడీపీ ల పొత్తులను వైసీపీ చిత్తు చేస్తుందా అనేది మాత్రం వేచిచూడవలిసిందే.