Business Idea : ఈ బిజినెస్ చేశారంటే.. లక్షల్లో ఆదాయం..! బిజినెస్స్

Business Idea : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు చేయాలనే ఆలోచనతో ఉంటున్నారు. అందులో చాలామంది వ్యాపారాలు చేస్తూ మంచి లాభార్జన పొందుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నట్లయితే.. ఎలాంటి వ్యాపారం చేయాలో మీకు ఒక ఐడియా ఉండాలి.. అప్పుడే మంచి ఆదాయం లభిస్తుంది. ఇకపోతే మీకోసం మేము ఒక బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ఈ బిజినెస్ ఐడియా ని మీరు ఫాలో అయితే మంచిగా డబ్బులు రావడంతో పాటు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. అయితే ఈ వ్యాపారం చేయడానికి మీ దగ్గర కేవలం కొంచెం భూమి ఉంటే సరిపోతుంది.

This business.. you can get more profit...
This business.. you can get more profit…

అదే నల్లబియ్యం సాగు.. నల్ల బియ్యాన్ని పండించి మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. ఈ బియ్యం ఇప్పుడు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలలో పండుతున్న నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా మంచి డిమాండ్ పెరిగింది. బ్లాక్ రైస్ ను పండించడం వల్ల మీకు కళ్ళు చెదిరే లాభాలు కూడా వస్తాయి. ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో కూడా చాలామంది నల్ల బియ్యాన్ని పండించడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణ బియ్యం ధరతో పోల్చుకుంటే ఈ నల్ల బియ్యం ధర మూడింతలు రెట్టింపు ధర పలుకుతుంది. ఉదాహరణకు కేజీ మామూలు బియ్యం ధర 50 రూపాయలు ఉంటే నల్లబియ్యం ధర కేజీ రూ.200 పలుకుతోంది.

మామూలు బియ్యంలో కంటే దీనిలో పోషక పదార్థాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ధర కూడా ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో నల్లబియ్యాన్ని పండించడానికి వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. నల్ల బియ్యం విత్తనాల ధర కేజీ రూ.200 ఉంటుంది. వరి సాగులాగే ఈ పంట కూడా చేయాలి. ఈ వరి హెక్టార్ కి 30 టన్నుల దిగుబడిని అందిస్తుంది. ఈ నల్ల బియ్యం సాగు చేస్తే రైతుల లాభాలను పొందవచ్చు. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈ పంటతో రైతు రాజు అవుతాడు అనడంలో సందేహం లేదు.