Hair Tips : పైసా ఖర్చు లేకుండా హెయిర్ స్ట్రెయిట్ చేసుకోండిలా.! బెస్ట్ రిజల్ట్స్.!

Hair Tips :  హెయిర్ ఏ ఆకారంలో ఉన్నా కానీ జుట్టు రాలకుండా మెయింటైన్ చేస్తూ ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి.. వెంట్రుకలు స్ట్రెయిట్ చేయడం అనేది ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. అందరూ కోరుకునేది కూడా అదే అయితే ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా ఇంట్లోనే హెయిర్ స్ట్రెయిట్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం..

Natural remedies for Hair straighting..
Natural remedies for Hair straighting..

నాచురల్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ కోసం కొబ్బరి పాలు, నిమ్మరసం బెస్ట్ చాయిస్. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి తే అది చక్కని క్రీం లాగా తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లలకు అప్లై చేసి ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఆ తరువాత దువ్వితే జుట్టు మృదువుగా మెరుస్తూ స్ట్రెయిట్ గా అవుతుంది. మొదటిసారి చేసినప్పటి నుంచే హెయిర్ స్ట్రెయిట్ అవ్వడం కనిపిస్తుంది.

హెయిర్ స్ట్రెయిట్ అవ్వడం కోసం రెండు చెంచాల చొప్పున కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్ సమాన మోతాదులో తీసుకోవాలి దీనిని బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకోవాలి గోరువెచ్చగా ఈ నూనె ఉన్నప్పుడు తలకు రాసుకొని పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను తరచుగా పాటిస్తూ ఉంటే జుట్టు స్ట్రెయిట్ అవ్వడం మీరే గమనిస్తారు. 5 స్ట్రాబెర్రీలను తీసుకొని అందులో తగినన్ని పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి ఈ చిట్కా కూడా హెయిర్ స్ట్రెయిట్ అవ్వడానికి సహాయపడుతుంది.