Pranitha : అమ్మ‌ను మించిన అందంతో.. ప్ర‌ణీత కూతురు భ‌లే క్యూట్ క్యూట్‌గా ఉందిరోయ్….!

Pranitha : క‌న్న‌డ అమ్మాయి అయిన తెలుగు సినిమాల‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ ప్ర‌ణీత‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. 1992 అక్టోబరు 17న బెంగుళూరులో ప్రణీత సుభాష్ జన్మించ‌గా, ఆర్యన్ ప్రెసిడెన్సీ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసింది.. ఇక‌ బెంగళూరు విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేశారు. 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన ‘పోకిరి’ రీమేక్ ద్వారా కన్నడలో ప్రణీత సుభాష్ సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ప్రణీత సుభాష్ తెలుగులో తెరంగేట్రం చేయ‌గా, సిద్దార్థ్ సరసన తెలుగులో నటించిన బావ సినిమాతో ప్రణీత కు మంచి గుర్తింపు ద‌క్కింది.

pranitha-daughter-cute-pics-are-stunning
pranitha-daughter-cute-pics-are-stunning

Pranitha : క్యూట్ బేబి..

అత్తారింటికి దారేది చిత్రంలోను ప్ర‌ణీత ఓ కీల‌క పాత్ర‌లో న‌టించి ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే ఈ అమ్మ‌డు పెళ్లి చేసుకుంది. ఏమాత్రం హడావిడి లేకుండా సడెన్ గా పెళ్లి చేసుకున్న ఈ అమ్మ‌డు ప్రెగ్నెంట్ అయ్యాక మాత్రం చాలా ఎక్కువ హడావిడి చేసింది. బేబీ బంప్ తో ప్రణీత చేసిన ఫోటో షూట్స్ తెగ వైరల్ అయ్యాయి. మరీ ఇంత అతి అవసరమా అంటూ నెటిజన్లు అప్పుడే చురకలు కూడా అంటించిన ఈ అమ్మ‌డు మాత్రం అస్స‌లు తగ్గలేదు.

pranitha daughter
pranitha daughter

బాత్ టబ్ లో స్నానం చేస్తూ బేబీ బంప్ తో చేసిన ఫోటోపై జ‌నాలు తెగ‌ మండి పడ్డారు . డెలివరీ అయ్యాక ప్రణీత కాస్త గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు కొంత ఎక్కువ ఉన్న డోస్ ఫోటోషూట్స్ చేసుకుంటూ హడావిడి చేస్తోంది. అంతే కాదు డెలివరీ వల్ల పోయిన తనఫిజిక్ ను.. అందాన్ని మళ్లీ తిరిగితెచ్చుకోవాలి అని కృషి చేస్తుంది. ఇక హీరోయిన్ ప్రణీత సుభాష్ ఫస్ట్ టైం త‌న కూతురు ఫోటోలు ఫ్యాన్స్ తో షేర్ చేశారు. ఇంస్టాగ్రామ్ లో తన చిన్నారితో దిగిన ఫోటోలు పోస్ట్ చేయ‌గా, చిన్నారి భ‌లే క్యూట్‌గా ఉంద‌ని జనాలు తెగ మెచ్చుకుంటున్నారు.

pranitha daughter images
pranitha daughter images