Samantha : స‌మంత లేటెస్ట్ ఫోటోలు విడుద‌ల‌.. నీర‌సించిపోయిన‌ట్టు క‌నిపిస్తున్న సామ్‌ని చూసి ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఉన్న స‌మంత మొన్న‌టి వ‌ర‌కు త‌న విడాకుల విష‌యంతో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు హెల్త్ కి సంబంధించిన విష‌యంతో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని రీసెంట్‌గా స‌మంత‌నే ప్ర‌క‌టించింది.. దీంతో అంద‌రు ఆందోళ‌న చెందారు. త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్ల వ‌ర్షం కురిపించారు. . నిజానికి స‌మంత‌కు ముందు నుంచి హెల్త్ ప్రాబ్ల‌మ్స్ ఉన్నాయట‌. ఆమె కెరీర్ ప‌రంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడే స్కిన్ డిసీజ్‌తో బాధ‌ప‌డిందిని, ఇందుకోసం ఆమె కేర‌ళ‌లో ఆయుర్వేద చికిత్స‌తో పాటు విదేశాల్లోనూ ట్రీట్‌మెంట్ తీసుకున్న‌ట్టుగా అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

samantha-latest-pics-are-stunning
samantha-latest-pics-are-stunning

Samantha :  ఇలా అయిపోయిందేంటి…

అయితే స్కిన్ డిసీజ్ కాస్త త‌గ్గింది అనుకునే స‌మ‌యంలో స‌మంత మ‌యోసైటిస్ వ్యాధితో బాధ‌ప‌డుతుండ‌డం అభిమానులని ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌ర‌చింది.ఈ వ్యాధి నుండి త్వ‌ర‌గా కోలుకోవ‌డం క‌ష్ట‌మైన‌ప్ప‌టికీ స‌మంత మాత్రం గ‌ట్టిగానే పోరాడుతుంద‌ట‌. ఓవైపు స‌మంత‌కి ఆరోగ్యం సహకరించడం లేదు. మ‌రోవైపు ఆమె న‌టించిన య‌శోద చిత్రం నవంబర్ 11న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో ఆరోగ్యం సహకరించక పోయినా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగింది స‌మంత‌. సోష‌ల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స‌మంత‌… నా ఫ్రెండ్ ఒకరు ఒక మాట చెప్పారు. ఆ రోజు ఎంత కఠినంగా ఉన్నా తన మోటివ్ ఒక్కటే.. అనుకున్న పని చేసి చూపించాలి. అతని నుంచే ఆ మోటివ్ ని నేను రుణంగా తీసుకున్నా. యశోద ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగా అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింద స‌మంత‌.

పిక్స్ లో స‌మంత బ్లాక్ డ్రెస్‌లో క‌నిపించ‌గా, ఫోటోస్ లో సమంత బాగా నీరసంగా కనిపిస్తోంది. మయోసైటిస్ ప్రభావం ఆమెపై స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సమంత చూడడానికి చాలా డల్ గా ..నిరసించిపోయి.. బక్క చిక్కిపోయి ఫేస్ మొత్తం మారిపోయి ..పూర్తిగా అనారోగ్యానికి గురైన అమ్మాయిగా క‌నిపిస్తుంది. ఇది చూసి ఆమె అభిమానులు అల్లాడిపోతున్నారు. స‌మంత నువ్వు ఫైట‌ర్. త‌ప్ప‌క కోలుకుంటావు అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

సమంత ..గెట్ వెల్ సూన్ అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు యశోద సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నువ్వు ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఫుల్ హ్యాపీగా పాల్గొంటామని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒకప్పటి సమంతని చూసిన జనాలు ఈ ఫోటోలను సమంతను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.. చాలా మారిపోయింది సమంత అంటూ ఫీల్ అవుతున్నారు. ఈ ఫోటోలో సమంత చాలా డల్ గా నీరసంగా కనిపిస్తుంది. ఇక ఇప్పట్లో స‌మంత షూటింగ్‌కు వ‌చ్చే ఛాన్సులు లేక‌పోవ‌డంతో ఖుషి రిలీజ్ డేట్ మ‌రోసారి వాయిదా ప‌డింది. మైత్రీ వాళ్లు ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రిలో కాకుండా స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. స‌మంత‌కు మ‌రి కొద్ది రోజులు విశ్రాంతి అవ‌స‌రం అని.. క‌నీసం నెల రోజుల పాటు ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్సే లేదంటున్నారు. ఆమె కోలుకుంటే డిసెంబ‌ర్ నుంచి ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.