Daily Astrology : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అప్పుల పాలవుతారు జాగ్రత్త..!

Daily Astrology : మేషం:
నూతన వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కూడా కలుగుతాయి. విలువైన వస్త్ర , ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

Today horoscope.. these zoadic signs of people will be in debt, beware..!
Today horoscope.. these zoadic signs of people will be in debt, beware..!

వృషభం:
వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు.. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఒకవేళ అప్పు చేస్తే అప్పులు బాధలు తప్పవు.

మిధునం:
వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దైవచింతన పెరుగుతుంది. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణాలు చేయకపోవడం మంచిది లేదంటే అప్పుల పాలవుతారు. ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు.

కర్కాటకం:
వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. కొన్ని సమస్యల నుండి కుటుంబ సభ్యుల సహాయంతో బయటపడగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు కూడా అందుతాయి.

సింహం:
బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు తొలగిపోతాయి.

కన్య:
స్త్రీ సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి వ్యవహారాలలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తీ కాక మానసిక చికాకులు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు.

తుల:
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి.

వృశ్చికం:
వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. అన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.

ధనస్సు:
చేపట్టిన పనుల్లో నైపుణ్యంతో అందరినీ మీ మాటకు తీసుకొస్తారు. మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు. మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార పరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.

మకరం:
వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమిస్తారు. దైవ సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సాగుతుంది.

కుంభం:
శారీరకంగా, మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలుపరచి లాభాలను పొందుతారు. గృహముల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.మిత్రులకు ధన సహాయం అందిస్తారు.

మీనం:
క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు. విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి.