Chiranjeevi-Balakrishna : చిరు, బాలయ్య ఇద్దరు ఒకే చోట కలసి సంక్రాంతి సందడిని ముందుగానే ఫాన్స్ కి అందించబోతున్నారా ??

Chiranjeevi-Balakrishna :  పలువురు స్టార్ హీరోలు ఈ సంక్రాంతి సీజన్ లో పోటీపడాలని ప్రయత్నించి అనేక కారణాలతో వెనక్కి తగ్గారు. ఈ విధంగా కొన్ని సినిమా లు పోటీ నుంచి తప్పుకోవడం తో ఈ సారి సంక్రాంతి ఇద్దరు పెద్ద హీరోలకు కలిసిరాబోతుంది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అదే విధంగా నందమూరి బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ సినిమాలు సంక్రాంతి పోటీలో తలపడబోతున్నాయి. ఒకే ఒక్కరోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలురావడం తో బాక్సాఫీస్ వద్ద కోలాహలమే జరగబోతుంది అని కామెంట్స్ వస్తున్నాయి.

Chiru and Balayya are going to present Sankranthi noise to the fans in advance
Chiru and Balayya are going to present Sankranthi noise to the fans in advance

ఈ కారణం గా ఇప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా మెగా , నందమూరి అభిమానులు మాటల యుద్ధం మొదలుపెట్టేసారు. గతం లో వచ్చిన రికార్డులను గుర్తు చేసుకుంటూ.. ఈసారి గెలుపు మాదే అంటే మాదే అని పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. అయితే ఇక్కడ అభిమానులు వీర సింహా రెడ్డి vs వాల్తేరు వీరయ్య అని గొడవలు పడకుండా బాలయ్య + చిరంజీవి అనేవిధం గా ఆలోచన చేయగలిగితే మాత్రం తమ అభిమాన హీరోల సినిమాలకూ ప్రయోజం ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే అటు బాలకృష్ణ ఇటు చిరంజీవి ఈ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారివే. ఒకే సంస్థలో నిర్మించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయడం ఇంతకుముందు ఎప్పుడూ జరిగింది లేదు. ఒకే సంస్థ సినిమాలమధ్య క్లాష్ వస్తే అది కలెక్షన్స్ మీద భారీ ప్రభావం చూపుతుంది. కానీ ఇప్పుడు మైత్రీ నిర్మాతలకు ఆ పరిస్థితి తప్పడం లేదు. ఒకటీ రెండు రోజుల వ్యవధిలో ఈ రెండు సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిర్మాత శ్రేయస్సు దృష్ట్యా రెండు సినిమాల మధ్య పోటీగా తీసుకోకుండా ,రెండూ సినిమాలు ఒకటే అనే విధంగా ప్రచారం చేయడం ఎంతయినా అవసరం. అలాగే చిరు, బాలయ్య తమ సినిమా లను విడివిడిగా ప్రమోట్ చేయడం కన్నా ఇద్దరూ కలిసి ప్రమోట్ చేయడం వలన నష్టం తగ్గించవచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు. రెండు సినిమాల ప్రమోషన్స్ కోసం, ఇద్దరు టాప్ హీరోలను ఒకే వేదిక మీదకు తీసుకు రాగలిగే లా ప్లాన్ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు.

ఒకరి ఈవెంట్స్ కు మరొకరిని గెస్టుగా తీసుకురావడం
లేదంటే, రెండు సినిమాలకూ కలిపి ఒకే ఈవెంట్ చేస్తూ వారిద్దర్నీ తీసుకురావడం వలన నిర్మాతలకు కాస్త ఊరట కలుగుతుంది అని చెప్పక తప్పని పరిస్థితి. బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు కాబట్టి చిరంజీవిని ఈ ప్రోగ్రాం కి గెస్టుగా తీసుకురావడం వలన ఫాన్స్ కి కూడా మంచి మెసేజ్ అందుతుంది. ఈ కలయిక తో ప్రేక్షకులకు సంక్రాతి పండుగా ముందుగానే వచ్చినట్టు ఉంటుంది. ఇది ఇద్దరి అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసేసే మంచి సందేశం కూడా అవుతుంది. బాక్సాఫీస్ క్లాష్ కూడా ఉండదు. ఇద్దరు సీనియర్ హీరోల ఫ్యాన్స్ ఒకరి సినిమాలు మరొకరు ఆదరించే అద్భుతమైన అవకాశం కూడా కలుగుతుంది. మాటల యుద్దాలకన్నా,ప్రేమ పూరితమైన మాటలు ఎలా ఉంటాయో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇలా చేయడం వలన రెండు సినిమాలు మంచి ఓపెనింగ్స్ ని కూడా తీసుకువస్తాయి. ఇటు మేకర్స్, అటు ఫాన్స్ తో పాటు ఈ రెండు చిత్రాలకు మంచి ప్రయోజనం కలగడం కోసం ఆ దిశగా ఆలోచన చేస్తే మాత్రం” సిని” చరిత్రలో నే ఈ ఘటన చిరస్థాయిగా నిలబడి భవిష్యత్తులో ఎందరో హీరోలకు ఆదర్శం గా ఉంటుంది.