Samantha : సమంత లేటెస్ట్ ఇంటర్వ్యూ చూసిన నాగచైతన్య రియాక్షన్ ఇదే.!

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న యశోద సినిమా ప్రమోషన్లలో భాగంగా సుమ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ ఇంటర్వ్యూలో సమంత తన హెల్త్ కండిషన్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. సమంత అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసినా నాగచైతన్య రియాక్షన్ ఏంటంటే.!?

Samantha latest interview video watching after nagachaithaya reaction
Samantha latest interview video watching after nagachaithaya reaction

సమంత నాగచైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ బంధం మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది. పెళ్లి చేసుకున్న నాలుగో సంవత్సరంలోనే విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. వీళ్ళిద్దరూ కలిసిపోవాలని ఇద్దరు అభిమానులు ఇప్పటికీ కోరుతూనే ఉన్నారు. సమంత యశోద సినిమా ప్రమోషన్లలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టిన విధంగానే కొన్ని రోజులు మంచి రోజులని, కొన్ని రోజులు చెడ్డ రోజులని చెప్పకు వచ్చింది. ప్రస్తుతానికైతే తాను బాగానే ఉన్నానని తన ఆరోగ్య విషయంలో రకరకాల వార్తలు వచ్చాయని.. తాను ఇంకా చావలేదని సమంతా చెప్పుకొచ్చింది. ఒక్కొక్క రోజు తాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని అలా వేస్తే ఇంకా అంతా అయిపోతుంది అని అనిపిస్తుందని.. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇన్ని దాటి వచ్చానా అని అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంది.

అయితే ఈ విషయాలు మాత్రం ఇన్ డైరెక్ట్ గా నాగచైతన్యను ఉద్దేశించి మాట్లాడినట్టుగానే అనిపించాయి. బహుశా అది విడాకుల విషయం గురించి అని అర్థమవుతుంది. ఆ సమయంలో తన పరిస్థితి ఎలా ఉందో చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంది అని అర్థమవుతుంది. తాజాగా ఈ ఇంటర్వ్యూ చూసినా నాగచైతన్య సమంత అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తను కూడా ఎమోషనల్ అయ్యాడట. సమంత తన ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు తన కంట్లో నుంచి కన్నీటి చుక్క రాకుండా చూసుకున్నాడట. ఈరోజు సమంత మీడియా ముందు ఏడవడం చూసి తను తట్టుకోలేకపోయాడట. సమంత ఏడవడం చూసి చైతు కూడా బాధపడ్డాడని తన సన్నిహితులు చెబుతున్నారు.