BalaKrishna : టిడిపి గెలవడం పక్క.. తోపులాంటి లీడర్ ని లైన్ లో పెట్టిన బాలయ్య..

BalaKrishna : రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు గంటా శ్రీనివాసరావు.. గెలుపుకి కేరాఫ్ అడ్రస్ .. పార్టీతో సంబంధం లేకుండా నియోజకవర్గం ఏదైనా గెలుపుకి గ్యారెంటీ ఆయన.. 2019 ఎన్నికల తర్వాత అధికార వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేశారని కొన్ని వదంతులు అయితే వచ్చాయి.. కారణం ఏదైనా కానీ ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీకి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు..

టిడిపి అధిష్టానానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఆ రాజీనామాను అంగీకరించడానికి ఆయనే స్వయంగా స్పీకర్ ను కూడా కలిశారు. కానీ ఆ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు . ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కూడా టిడిపిని లైట్ తీసుకున్నారు. అధినేత కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీలో గంటా శ్రీనివాస్ ఉన్నారా లేరా అనేది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. ఇలా ఎన్నో కారణాలతో ఆయన చంద్రబాబును సైతం పట్టించుకోలేదు.

 

ఎమ్మెల్యేగా ఆయన చంద్రబాబుతో కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు జనసేన బిజెపి ఏదో ఒక పార్టీలో ఆయన చేరతారని అంతా అనుకుంటున్నారు.. ఇక అదే నిజమని అధిష్టానం కూడా భావించింది . ఇలాంటి సమయంలో ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు టిడిపి నార్త్ నియోజకవర్గంలో జరిగిన మహిళా కమిటీ ప్రమాణ స్వీకారం లో కనిపించి ఆయన అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ మీటింగుకి హాజరు కావటమే కాకుండా అధినేత చంద్రబాబు నాయుడుని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలి అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధిష్టానం నుంచి బూత్ లెవెల్ వరకు టిడిపి బలంగా ఉందని ఆయన తెలిపారు.

 

సడన్గా గంటా శ్రీనివాసరావు లో ఎంత మార్పు రావడానికి మాత్రం కారణం నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది. బాలయ్య ఇటీవల టిడిపిలో చురుగ్గా ఉండటంతో పాటు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలను ఎదుర్కొనటానికి నేను సిద్ధంగా ఉన్నానని గంట శ్రీనివాసరావు బాలకృష్ణ తో చెప్పడంతో ఇక అదే విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబుకి తెలియజేశారట. దాంతో గంటా శ్రీనివాసరావు మళ్ళీ టిడిపిలోకి వస్తున్నారని సమాచారం. ఇక గంటా శ్రీనివాసరావు సుమారు 45 నిమిషాల పాటు బాలయ్యతో మాట్లాడి పార్టీలో తన స్థానాన్ని కూడా పదిలం చేసుకున్నారని సమాచారం.