Sri Garikapati – RRR Movie : రామ్ చరణ్, తారక్ డ్యాన్స్ చేసిన నాటు నాటు పాటపై గరికపాటి నరసింహారావు హిల్లరియస్ కామెంట్స్

Sri Garikapati-RRR Movie : భారత చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటను ఆస్కార్స్ 2023 వేదికపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్‌లో పాడనున్నారు. ఇటీవల ఈ పాటకు గ్లోబల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.. కాగా నాటు నాటు పాట పై గరికపాటి నరసింహారావు తనదైన శైలిలో స్పందించారు..

నాటు నాటు పాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాటను సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేశారు. లిరిసిస్ట్ చంద్రబోస్ రచించగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఇప్పటికే ఆస్కార్స్‌కు నామినేట్ అయింది. అయితే ఈ పాట విన్న ప్రముఖ ప్రవచనకర్త శతావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి గరికపాటి నరసింహారావు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఈ పాట నేను విన్నానని.. ఈ పాట అంతా కూడా తెలుగు వాక్య నిర్మాణం తోనే రాశారని అది చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు.

నాటు నాటు పాట గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అందుకే నేను ఈ పాట గురించి తెలుసుకున్నానని అన్నారు. ఈ పాట నేను ఎప్పటి వరకు వినలేదు. కానీ నేను ఒకసారి విందామని ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే అరగంట పాటు ఈ పాట విన్నానని గరికపాటి అన్నారు. ఇక ఈ పాటకు డాన్స్ వేసినా రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చాలా చక్కగా డాన్స్ చేశారని ఒక తల్లి కడుపున పుట్టిన కవలలు కూడా ఇంత అద్భుతంగా డాన్స్ చేయలేరని.. కానీ వీళ్లు మాత్రం ఆ లోటు తెలియకుండా ఇద్దరూ ఒకేలాగా డాన్స్ చేస్తూ అందరినీ మైమరిపించాలని గరికపాటి అన్నారు.

చంద్రబోస్ రాసిన ఈ పాట తెలుగు పద వ్యాకరణం లో ఉందని గరికపాటి అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి చక్కటి సంగీతాన్ని అందించారని గరికపాటి ప్రశంసలు కురిపించారు. తెలుగు భాష నుంచి పుట్టిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు వరకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం గరికపాటి నాటు నాటు పాటపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.