Comedian Roller Raghu Home Tour : కళ్ళు మిరిమిట్లు గొలిపే ఇంద్ర భవనం లాంటి జబర్దస్త్ కమెడియన్ రోలర్ రఘు ఇల్లు చూశారా ఎప్పుడైనా.?

రఘు కళ్ళు జిగేల్ అనిపించేలా ఉన్నా ఖరీదైన భవనంలో ఉంటున్నాడు. మొక్కలు, జంతువులు అంటే అతనికి అమితమైన ఇష్టం. అందుకే ఇంటిని హరితవనం లాగా మార్చేశాడు. తన ఇంట్లో పండని కూరగాయ లేదు. పువ్వులు పూయని మొక్క లేదు. ఒక్క ఉల్లిపాయ తప్ప అన్ని రకాల కాయగూరలు, పువ్వులు , పండ్లు అన్ని తన ఇంట్లోనే పండిస్తున్నాడు. ఇక ఆ పంటలను తనే పండించి వాటిని ఇంట్లో వండుకొని తింటున్నాడు.

ఆ మొక్కలకు కావలసిన ఎరువుని కూడా తనే సిద్ధం చేస్తున్నాడు. ఇక తనకి షూటింగ్ ఉండి బయటకు వెళ్ళినప్పుడు మాత్రం తన కుటుంబ సభ్యులు, తన కార్ డ్రైవర్ , తన బామ్మర్ది ఆ మొక్కలను చూసుకుంటారని తెలిపారు. మొక్కలతో నేను మాట్లాడతానని రెండు రోజులు నేను ఈ మొక్కలకి గాని కనిపించకపోతే అవి నా మీద దిగులేసుకుంటాయని.. వాటిని నేను వచ్చి ఒక్కసారి పలకరిస్తే అవి మళ్లీ వాడిపోకుండా ఫ్రెష్ గా కనిపిస్తాయని.. ఏవైనా మొక్కలు నామీద దిగిలేసుకొని ఉంటే ఆ మొక్కలకు నేను పలకరించి ఒక గ్లాస్ నీళ్లు పోస్తే చాలు అవి వెంటనే వికసించుకొని నవ్వుతూ నాతో మాట్లాడేస్తాయని రఘు చెప్పారు.

ఇక రఘు కి కాస్త సమయం దొరికితే తీసుకొని అడవుల్లోకి వెళ్లిపోతానని పచ్చని చెట్ల మధ్య విశ్రాంతి తీసుకుంటానని.. అడవుల్లోకి వెళ్ళిపోయినప్పుడు కార్ పక్కనే పార్కు చేసుకొని.. టెంట్ వేసుకొని.. ఫైర్ వేసుకొని అక్కడే వండుకొని తింటానని చెప్పారు. అలా చాలా రాష్ట్రాలు తిరిగానని రఘు చెప్పుకొచ్చారు. తను ఒక ప్రకృతి ప్రేమికుడినని రఘు తెలిపారు.