AP Sarkar: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన వైసీపీ ప్రభుత్వం..!

AP Sarkar.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమంపైనే పూర్తిగా ఫోకస్ చేస్తున్నట్లు తాజా సమాచారం.. ముఖ్యంగా విద్యా వైద్య రంగాలకు ఆయన పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన ఆయన.. అలాగే పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించడమే లక్ష్యంగా అమ్మ ఒడి తో సహా  పలు పథకాలను కూడా క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారు. మరోవైపు వైద్యరంగంలో సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నారు.  ఎంతటి ఖరీదైన వైద్యమైనా పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు.
Andhra Pradesh: Good news for the people of AP.. 'Family Doctor' in full  from March 15.. Details.. | Andhra Pradesh CM Jagan Government to Introduce  Family Doctor Concept From March 15th
ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ ద్వారా అనేకమందికి లబ్ధి చేకూరేలా చేసిన సర్కార్, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే ఫ్యామిలీ డాక్టర్.. తాజా వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. అదే రోజు ఒక విలేజ్ క్లినిక్ దగ్గర ఒక విలేజ్ క్లినిక్ ప్రారంభించనున్నారు. ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్టులో ఇప్పటివరకు 45,90, 086 మందికి ఆరోగ్య సేవలు అందించింది ప్రభుత్వం. ఇకపోతే సీఎం ఆదేశాల మేరకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.