Telangana.. మహిళలకు కేసీఆర్ సర్కార్ ఇప్పుడు మరో కానుక ఇవ్వనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వ కానుక ఇచ్చేందుకు సిద్ధమయింది. ఈ మేరకు 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నిధులను విడుదల చేసింది తెలంగాణ సర్కార్. పురపాలికల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 250 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్.
మరో 500 కోట్ల రూపాయల నిధులను గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలకు నిధులు విడుదల చేసామని వివరించారు. అలాగే ఆరోగ్యం మహిళా కార్యక్రమం రేపు హాలిడే కూడా ప్రకటించింది సర్కారు. తెలంగాణ సర్కార్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చేస్తున్న ఈ సహాయానికి తెలంగాణ మహిళలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక రేపు కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేసే మహిళలందరికీ స్పెషల్గా హాలిడే ప్రకటించింది.