Avinash Reddy : నన్ను అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్..

Avinash Reddy : వైఎస్ వివేకా ప్రాణాలు తీసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. అవినాష్ కి 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అందువలన తనను అరెస్ట్ చేయకూడదని పిటిషన్‌ లో తెలిపారు. విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌ కు అనుమతి ఇవ్వాలని కోరారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపించాలని పిటిషన్‌ లో పేర్కొన్నారు..వివేకా వధ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. అందులో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డికి భాస్కర్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

Avinash Reddy petition in the high court
Avinash Reddy petition in the high court

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని సీబీఐ పలుమార్లు విచారించి ఈనెల 10న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. సీబీఐ విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు కీలకంగా మారింది.సీబీఐ విచారణ సందర్బంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి రిట్ పిటీషన్ దాఖలు చేశారు.ఇంకా న్యాయవాది సమక్షంలోనే తన సీబీఐ విచారణ జరిగేలా చూడాలని ఈ పిటీషన్ లో తెలిపారు.

అంతేకాదు తనకు 150 సీఆర్పీసీ కింద నోటీసుల ప్రకారం.. తనను అరెస్ట్ చేయకూడదని కోర్టు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు సమర్పించిన పిటీషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. రేపు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి హైకోర్టు కి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ విచారణతో బయటకు వస్తారేమో నని వైఎస్ వివేక అభిమానులు కోరుకుంటున్నారు.