Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు రీ హీరోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోగా అనిపించుకుంటున్నారు.. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. చిన్న పిల్లల ఆరోగ్యానికి పెద్ద పీట వేసి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఉదారమైన కార్యక్రమాలను చేస్తున్నారు. ఇక అలాంటి సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్..
మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఓ పేద అమ్మాయి చదువుకోవడానికి తన వంతు సహకారాన్ని అందించారు ఆ అమ్మాయి చదువుకోవడానికి కావలసిన లాప్ టాప్ ను ఉచితంగా అందించడంతోపాటు ఆమె చదువుకు కావలసిన ఆర్థిక భరోసాను కూడా నమ్రత ఇచ్చారు. ఈ సందర్భంగా నమ్రత అమ్మాయితో మాట్లాడుతూ నువ్వు మంచిగా చదువుకోవాలి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి. మీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి అంటూ పలు విషయాలను ఆమెతో పంచుకున్నారు.
ఇక ఆ అమ్మాయి నమ్రతా ఇచ్చిన డెల్ కంపెనీ లాప్టాప్ ను ఓపెన్ చేసి అందరికీ చూపించింది. అంతేకాకుండా నాకు చదువుకోవడానికి ఆర్థికంగా వెన్నుముకలా నిలిచిన మహేష్ బాబుకి అలాగే ఆయన భార్యకి కృతజ్ఞతలు తెలిపింది. నమ్రత మేడం చెప్పినట్లుగానే జీవితంలో మంచి స్థాయికి వెళ్తానని తెలిపింది.
నమ్రత చేసిన సాయం గురించి సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఈ వీడియోను వైరల్ చేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా మా వదిన గుణంలో సీత.. రియల్లీ హాట్సాఫ్ మ్యామ్ ఇలాంటి మంచి పనులు మీరు చేస్తూనే ఉండాలి అంటూ.. నమ్రత పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.