Pragathi..తెలుగు తెరపై మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన నటి ప్రగతి గురించి చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో హీరోయిన్గా నటించిన ఈమె ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు కూడా వెళ్ళింది. అయితే ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలలో అక్క, వదిన, అమ్మ పాత్రలో నటిస్తూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె తన గురించి పలు విషయాలను తెలిపింది.
అంతఃపురం, మురారి సినిమాలు చూసిన తర్వాత కృష్ణ వంశీ గారి సినిమాలో చేయాలనిపించింది. కానీ ఆయన సినిమాలో మాత్రం అవకాశం రావడమే చాలా కష్టమైన విషయం అనుకున్నాను. కానీ గోవిందుడు అందరివాడేలే సినిమాలో అవకాశం వచ్చింది.. ఆ సినిమా సమయంలో ఆయనను చూశానని తెలిపింది ప్రగతి. కృష్ణవంశీ గారి సింప్లిసిటీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను.. అన్ని ఉన్న అనిగిమనిగి ఉంటారు అనే సామెత ఆయనను చూస్తే గుర్తుకు వస్తోంది అంటూ తెలుపుతోంది ప్రగతి. అందుచేతనే ఆయన సినిమాలోని ప్రతి చిన్న పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుందని తెలుపుతోంది ప్రగతి.