Vidadala Rajani : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అనూహ్య ప్రగతిని సాధిస్తున్నాయని తెలిపారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని అన్నారు. 11.43 వృద్ధి రేటును సాధించామని చెప్పారు.
మహిళల భద్రతకు, సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నారని గవర్నర్ అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటా, మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చామని చెప్పారు. ఆపదలో ఉన్న మహిళల వద్దకు నిమిషాల్లో పోలీసులు వస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతోందని, అర్హులకు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
దాంతో అక్కడ ఉన్న వైసీపీ నాయకులంతా విడుదల రజిని చూస్తూ క్లాపింగ్ ఇచ్చారు. టీడీపీ నాయకులు గోల గోల చేశారు. దాంతో కాస్త అంతా గొడవ జరిగే సరికి గవర్నర్ అందర్నీ అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినా కానీ టిడిపి నాయకులు వారి ధోరణిలో వారు ముందుకెళ్లారు. కాసేపటికి అంతా సద్దుమణిగింది.
గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లామని తెలిపారు. మనబడి నాడునేడు ద్వారా తొలి దశలో రూ.3,669 కోట్లతో ఆధునికీకరణ చేపట్టామని.. విద్యారంగంలో సంస్కరణలు చేపట్టామని అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని.. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం బోధన అందిస్తున్నామని అన్నారు.
https://www.youtube.com/watch?v=XsamT4KE72A