Mahesh Babu – RRR 2 : దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వేదికపై తెలుగోడి సత్తా చాటింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కించుకుంది. విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తరుణం కళ్లముందు చేరింది. కోట్లాది మంది ప్రజల కోరిక నెరవేరింది. జక్కన్న సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవలం చేసుకుంది. ఇండియన్ సినిమాకు కొన్నేళ్లుగా కలగా మిగిలిన ఆస్కార్ అవార్డ్ ఆర్ఆర్ఆర్ చిత్రం సాకారం చేసింది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం పై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్పందించడంతోపాటు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు.
హాలీవుడ్ చిత్రాల్లోని పాటలను ఢీకొట్టి మరీ అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డ్ అందుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది.
ఆస్కార్ తనపై బాధ్యత మరింత పెంచిందని అన్నారు. ముందు ముందు ఇంకా మంచి కథలు రాసేందుకు ప్రోత్సాన్ని ఇంచిందని అన్నారు.
రచయితని గౌరవిస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్‌పై స్పందిస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్ అభిమానులకు క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఇంతకు మించి ఆర్‌ఆర్‌ఆర్2 ఉంటుందనే భరోసా ఇచ్చారు. ఇదే కథకి కొనసాగింపుగా కథ ఉంటుంది, ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తారని.. ఇదే కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నామని.. ఇంకా అంశాలను కథను బట్టి తారాగణం పెరగచ్చని తెలిపారు. ఇంతకు మించి దీనిపై ఇప్పుడు మరిన్ని వివరాలు తెలపలేనని అన్నారు.
ఇక మహేష్‌బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా గురించి కూడా ఓపెన్ అయ్యారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో అంతర్జాతీయంగా ఈ సినిమా ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా అంటే అదేదో కాదని, మనవైన ఎమోషన్స్, మనవైన కథలే ఉంటాయని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ లో అంతర్జాతీయ అంశాలేవి లేవని, కథ బాగుండాలని.. కథ బాగుంటే చూస్తారని.. ఆ కథ, ఆ ఎమోషన్ నచ్చిందని.. హృదయాన్ని హత్తుకుందని, అందుకే ఇంతగా ఆదరించారని.. దానికి భాషతో సంబంధం లేదన్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు సినిమా వర్క్ జరుగుతుందన్నారు. మొత్తానికి విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ 2, మహేష్ సినిమా లపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు.