బలహీనమైన రోగనిరోధక శక్తి, హార్మోన్ల అసమతుల్యత వల్ల కొందరికి శరీరంపై పులిపిర్లు వస్తాయి. రాపిడి ఎక్కువగా ఉన్న ముఖం, మెడ, చేతులు, పాదాల వంటి శరీరం భాగాలపై పులిపిర్లు వచ్చే ఛాన్సెస్ అధికం. వీటిని గిల్లటం లేదా కత్తిరించడం లాంటి పనులు ఎప్పటికీ చేయకూడదు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ముందుగా డెర్మటాలసిస్టులను సంప్రదించాలి. వారి సలహా మేరకు వీటిని తొలగించే ప్రయత్నాలు చేయాలి. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ కారణంగా పులిపిర్లు వస్తాయి. వీటిని ఇంగ్లీషులో వాట్స్ (Warts) అని పిలుస్తుంటారు.
పులిపిర్ల వల్ల చాలా అసౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా ముఖంపై ఇవి వస్తే బాధితులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే వీటిని ఇంటిలో దొరికే కొన్ని పదార్థాలతో కూడా తొలగించుకోవచ్చు. పైపెచ్చు ఇలాంటి పద్ధతులు అనుసరించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తలెత్తవు. ముందుగా పులిపిర్లు వచ్చిన వారు ఆ ప్రాంతంలో చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల వాటి తీవ్రత అనేది పెరగకుండా ఉంటుంది. రోజ్ వాటర్, ఫ్లవర్ జ్యూసులలో ఆరు చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి ఆ మిశ్రమాన్ని దూదితో పులిపిర్లపై అప్లై చేయాలి. దీనివల్ల వీటినుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
నెలకొకసారి హెర్బల్ బ్లీచ్ కూడా చేయించుకోవాలి. అలాగే మేకప్ వేసుకుంటే దానిని రాత్రిపూట అలాగే ఉంచకుండా తప్పకుండా తీసేయాలి. ఇక ఇంట్లో దొరికే వాటితో ఒక రెమెడీ తయారు చేసుకుని ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. ఆ రెమెడీ కోసం ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఈ రెబ్బలను బాగా దంచాలి. వెల్లుల్లి యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇక దంచిన వెల్లుల్లి రెబ్బలను ఒక స్ట్రైనర్ లేదా వడకట్టే గరిటెలో వేయాలి. ఆ వెల్లుల్లి రెబ్బలపై నిమ్మరసం పిండాలి. తర్వాత ఒక చెంచా తీసుకొని వెల్లుల్లి రెబ్బల నుంచి రసం కిందకు వచ్చేలాగా వత్తాలి. ఆ వెల్లుల్లి, నిమ్మ రసాన్ని ఒక చిన్న గిన్నెలో సేకరించాలి.
ఈ రసంలో ఒక టేబుల్ స్పూన్ వంటసోడా కలపాలి. తర్వాత తగినంత సున్నం యాడ్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పులిపిర్లపై ఐదు నుంచి ఆరుసార్లు రాయడం ద్వారా అవి మెత్తబడి రాలిపోతాయి. అయితే ఈ మిశ్రమం మామూలు శరీరంపై రాయకుండా జాగ్రత్త పడాలి. దీన్ని తయారు చేసే సమయం లేదనుకునే వారు తమ ఇంట్లో దొరికే నెయిల్ పాలిష్ ను పులిపిర్లపై అప్లై చేయాలి. దీనివల్ల వాటికి ఆక్సిజన్ అందుక అవి బాగా డ్రై అవుతాయి. రోజూ నెయిల్ పాలిష్ పులిపిర్లపై అప్లై చేయడం వల్ల అవి చివరికి రాలిపోతాయి. అయితే ఒక్కొకరి శరీరం అనేది ఒక్కలా ఉంటుంది కాబట్టి పైన చెప్పిన రెండు చిట్కాలను ట్రై చేసి చూడాలి.