శర్వానంద్ పెళ్ళికి వెళ్లిన మహేష్ బాబు 10 కోట్ల విలువచేసే కార్ గిఫ్ట్ గా ఇచ్చాడట?

టాలీవుడ్లో యువ నటుడు శర్వానంద్ స్థానాన్ని గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు శర్వా. జూన్ 3న రాత్రి 11 గంటలకు శర్వా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ వేదికగా చాలా గ్రాండ్‌‌గా జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరై కొత్త జంటని ఆశీర్వదించారు. అయితే నిన్న రాత్రి పెళ్లికి సంబంధించిన రెసెప్షన్ చాలా గ్రాండ్‌గా జరగగా దీనికి టాలీవుడ్ ప్రముఖులంతా మూకుమ్మడిగా కదిలి వెళ్లారు.

ఇక శర్వానంద్, పెళ్లిచేసుకున్న యువతి గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు అయిన రక్షిత రెడ్డి మన శర్వానంద్ శ్రీమతి. వారిరువురి పెళ్లి రిసెప్షన్ నిన్న అనగా ఈనెల 9న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరింగింది. ఈ సందర్భంగా ఈ ఫంక్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. తెలంగాణ మంత్రి కేటీయార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సైతం ఈ ఫంక్షన్ కి హాజరైజయ్యారు. టాలీవుడ్ నటులు అయినటువంటి వెంకటేష్, నితిన్, రామ్ చరణ్, దర్శకుడు క్రిష్, నటుడు నారాయణ మూర్తి, బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ హాజరైయ్యారు. కాగా దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అదంటే ఒకెత్తయితే, ఇపుడు మహేష్ బాబు పెళ్ళికొడుకు శర్వానంద్ కి ఇచ్చిన గిఫ్ట్ గురించిన విషయం సోషల్ మీడియాలో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. అవును, మహేష్ ఓ పది కోట్ల విలువైన కారుని శర్వాకి కానుకగా ఇచ్చాడట. విషయం దేవుడికెరుక గాని, ఈ విషయం గురించి తెలిసిన ఘట్టమనేని అభిమానులు మాత్రం మా హీరో సూపర్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. కాగా ఈ వేడుకకు తెలుగు సినీ హీరోలతో పాటు శర్వా ఫ్రెండ్స్‌, హీరోయిన్స్‌ కూడా హాజరు అయినట్టు తెలుస్తోంది. కాగా ఈ వేడుకకు శర్వానంద్ అత్యంత సన్నిహితుడు రామ్ చరణ్ కూడా హాజరు కావడంతో చరణ్ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడనే విషయంపైన ఇపుడు సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఇకపోతే శర్వానంద్‌ భార్య రక్షిత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఇక ఆమె తండ్రి తెలంగాణ హైకోర్ట్ లాయర్ మధుసూదన్‌రెడ్డి. తల్లి సుధారెడ్డి. శర్వానంద్ నిశ్చితార్ధం జనవరిలో ఘనంగా జరుగగా గ్యాప్ ఎక్కువ కావడంతో ఈ పెళ్లి క్యాన్సిల్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటన్నిటికి చెక్ పెడుతూ.. శర్వానంద్.. రక్షితతో తన వివాహాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాడు. ఇక మన యంగ్ హీరో శర్వానంద్.. 2003లో విడుదలైన ‘ఐదో తారీఖు’ సినిమాతో వెండితెరకి పరిచయమయ్యాడు.