N అక్షరంతో మీ పేరు మొదలైతే జరిగే అద్భుతాలు ఇవే!

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో జ్యోతిష్యానికి పెద్ద పీట వేశారు. మరీ ముఖ్యంగా ఇక్కడ హిందువులు జాతకాన్ని ఎక్కువగా నమ్ముతారు. పుట్టుకనుండి చావు వరకు సమయాన్ని బట్టి, తేదీన బట్టి ఇక్కడ మంచో చెడో అనేది నిర్ణయించుకుని తదనుగుణంగా కార్యాలు అనేవి చేపడతారు. జన్మించిన రోజుని, సమయాన్ని బట్టి ఇక్కడ పేర్లను నిర్ణయిస్తారు. ఇది హిందూ సంప్రదాయంలో పరంపరగా వస్తోంది. అయితే, ఇపుడు మనం ‘N’ అక్షరంతో ప్రారంభమయ్యేవారి జీవితం గురించి చూద్దాము. జ్యోతిషశాస్త్రం ప్రకారం ‘N’ అనురాధ నక్షత్రం కిందకు వస్తుంది. రాశి విషయానికొస్తే కన్యారాశి అవుతుంది. ఈ నక్షత్రం పాలక దేవుడు శని కాగా, దీని పాలక దేవుడు కూడా బుధుడు.

వృత్తి జీవితం:
వీరి వృత్తి జీవితం విషయానికొస్తే, ప్రారంభ దశలో కష్టాలు పడినప్పటికీ వీరు తమ మనసుతో విజయం సాధిస్తారు. వీరి జాతకంలో బుధుడు ఉండడం వలన ఉద్యోగానికి అనుకూలమైన జాతకం వీరిది. ఒక్క ఉద్యోగమే కాకుండా వీరు జీవితంలో ఇంకేదైనా గొప్పగా సాధించాలని ఆలోచిస్తారు. అయితే వీరు మాట్లాడేటప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడితే బావుంటుంది. లేదంటే, ఎదుటివారు అపార్ధం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇక వీరు ఎలాంటి కార్యాలయాలలో జాబ్స్ చేసినా ప్రమోషన్‌లకు డోకా ఉండదు. ఒక్క ఉద్యోగమే కాకుండా వ్యాపారం కూడా వీరికి బాగా అనుకూలిస్తుంది. మంచి వ్యాపారవేత్తగా వెలగడమే కాక సమాజంలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా అనేక రకాల ప్రాజెక్టులను కూడా వీరు నిర్వహిస్తారు.

వైవాహిక జీవితము:
ఇక వీరి వైవాహిక జీవితం విషయానికొస్తే, జీవిత భాగస్వామికి వీరికి మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఫలితంగా, బాధ్యతలను చక్కగా మరియు విజయవంతంగా నిర్వహించగలుగుతారు. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా వీరు తమ జీవిత భాగస్వామితో వివిధ ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. మంచి సంతాన యోగ్యం కలిగి వుంటారు.

ఆర్థిక జీవితం:
ఇక వీరి ఆర్థిక జీవితం విషయానికొస్తే, ఆర్థిక కోణం వీరికి అనుకూలంగానే ఉంటుంది. అక్కడక్కడా వీరు తీసుకొనే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు తప్పితే డబ్బుకి ఎటువంటి ఢోకా ఉండదు. వీరు వ్యక్తులను అంత త్వరగా నమ్మరు.. కాబట్టి నమ్మక ద్రోహానికి గురికాకుండా వుంటారు. తద్వారా చేసే వ్యాపారాలలో తక్కువ నష్టాలను చవిచూస్తారు. ముఖ్యంగా ఏప్రిల్-మేలో చేపట్టిన ప్రభుత్వ ప్రాజెక్టుల ద్వారా వీరు ఆర్థికంగా బలపడతారు.

ఆరోగ్య జీవితము:
ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, వీరు కడుపు సంబంధిత సమస్యల వలన అశాంతికి లోనవుతారు. ముఖ్యంగా వీరు ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ఆలస్యంగా చేసే భోజనం కారణంగా వీరు అనేక సమస్యలకు గురవుతారు.