Mahesh babu మహేష్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ కొరియో గ్రాఫర్?

Mahesh babu టాలీవుడ్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి తెలుగు కుర్రాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈయన తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ సినిమా పాటలకు కూడా కొరియోగ్రఫీ చేసాడు. శేఖర్ సినిమా కొరియోగ్రాఫర్ కావడానికి ముందు 6 సంవత్సరాలు బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా, మరియు 8 సంవత్సరాలు ప్రముఖ కొరియో గ్రాఫర్ల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. శేఖర్ 1979, నవంబరు 6న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ జన్మించాడు. విజయవాడలోని ఒక ఇన్స్టిట్యూట్ లో డాన్స్ కి సంబంధించి క్రాష్ కోర్సు నేర్చుకున్న శేఖర్, 1996లో బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా సభ్యత్వ కార్డును కూడా పొందాడు.

ఇకపోతే, కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ కొంతకాలం పనిచేసిన సంగతి అందరికీ విదితమే. ఈ విషయం గురించి రాకేశ్ మాస్టర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పగా అందరికీ తెలిసింది. ఆ సందర్భంలో రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ పైన కొన్ని అభియోగాలు కూడా చేయడం మనం చూసాం. అయితే ఆ మాటలు తాలూకా ఇంపాక్ట్ శేఖర్ మాస్టర్ పై ఎంతమాత్రమూ పడలేదు. పైగా టాలీవుడ్లో ఆయన ఇపుడు ఓ బిజీ కొరియోగ్రాఫర్. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోలతో శేఖర్ మాస్టర్ మంచి సంబంధాలను కలిగి వుంటారు.

ఈ క్రమంలోనే… సూపర్ మహేష్ బాబునుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు శేఖర్ మంచి రేపోని కలిగి వుంటారు. ఇటీవల ఓ మీడియా వేదికగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. మహేష్ బాబు శరీరం చాలా ఈజ్ తో ఉంటుందని, ఆయన ఎలాంటి చిన్న మూమెంట్ చేసినా అందంగా కనబడుతుందని… అందుకే అతని సినిమా కొరియోగ్రఫీ చేయడం అంటే తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు. అది మాత్రమే కాకుండా ఇంతవరకు వారి ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమా పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయని చెప్పుకొచ్చాడు.

ఇక సూపర్ స్టార్ మహేష్ – త్రివిక్రమ్ తాజా సినిమా అప్డేట్స్ విషయానికొస్తే… కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో దుర్మార్గులపై విలనిజం చేసే హీరోగా మహేష్ చేసే ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయని టాక్ వినబడుతున్నాయి. ఇప్పటివరకూ డీసెంట్ లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించిన మహేష్.. తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడని తెలియడంతో ఘట్టమనేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇందులో పూజా హెగ్డే మాత్రమే కాకుండా.. శ్రీలీల కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియోషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.