సీనియర్ నటి రాధిక 300 కోట్ల ఆస్తిని 5 నిమిషాల్లో సొంతం చేసుకున్న మహేష్ భార్య నమ్రత?

సీనియర్ నటి రాధిక… రాధిక శరత్ కుమార్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సుప్రసిద్ధ తమిళ, తెలుగు చలనచిత్ర కథానాయిక అయినటువంటి రాధిక 90sలో దుమ్ము లేపారు. ఆరోజుల్లో మెగాస్టార్ చిరు సరసన నటించి అంతే ధీటుగా ఆమె డాన్సులు చేసేవారు. అందుకే వారి జంటకు చాలా ప్రత్యేకమైన పేరు ఉండేది. ఇక ప్రముఖ సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె బాగా సుపరిచితం. ఎందుకంటే రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె స్వయంగా నిర్మిస్తున్నారు.

రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్.రాధా కూతురన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. రాధిక 1963 ఆగష్టు 21న జన్మించిన రాధికకు మూడుసార్లు వివాహము జరిగింది. ఈమెకు మొదట తమిళ నటుడు ప్రతాప్ పోతన్ తో 1985లో వివాహమైంది. రెండేళ్ల తరువాత విడిపోయి 1990లో రిచర్డ్ హార్డీతో జరిగిన రెండో వివాహం ద్వారా రయాన్నే హార్డీ అనే కూతురుని కన్నది రాధిక. ఆ తరువాత సహనటుడు శరత్ కుమార్ ను 2001లో మూడో వివాహము చేసుకోగా 2004లో వీరికి కుమారుడు రాహుల్ జన్మించాడు. ప్రస్తుతం వీరు సుఖంగా జీవిస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే, రాధిక 300 కోట్ల ఆస్తిని 5 నిమిషాల్లో మహేష్ భార్య నమ్రత సొంతం చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నటి రాధికకు హైదరాబాద్లో ఓ ఆఫీసు ఉండేదట. ఇక్కడ కెరీర్ తొలినాళ్లలో ఆమె ఒక ఆఫీసు కొన్నదట. హైదరాబాద్ లో అది తప్ప మరే ఇతర ఆస్తులు వారికి లేవట. అయితే ప్రస్తుతం వున్న ఆస్తిని అమ్మేసి రాధికా చెన్నై లో పెట్టుబడి పెట్టనుందని వినికిడి. దాంతో దానిని బేరం పెట్టగా సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత కేవలం ఆ 300 కోట్ల ఆస్తిని 5 నిమిషాల్లో సొంతం చేసుకోవడంతో రాధిక కూడా ఆశ్చర్యపోయిందట.

ఇదే విషయం ఇపుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక మహేష్ సినిమాల సంగతికి వస్తే… దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే జనవరిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాపైన అభిమానులు చాలా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈమధ్య కాలంలో మహేష్ కి హిట్స్ పడ్డాయి కానీ, బాక్షాఫీస్ షేక్ చేసే హిట్స్ అయితే పడలేదనే చెప్పుకోవాలి.