యాంకర్ సుమ, రాజీవ్ కనకాల గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో సగటు సినిమా హీరోయిన్ కంటే కూడా యాంకర్ సుమ అంటే యమ క్రేజ్ ఉంటుంది. మొదట సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే టాప్ యాంకర్ గా కొనసాగుతున్న యాంకర్ సుమ అంటే ప్రతి ఇంటి ఆడపిల్లకీ ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సుమ ఒక్కసారి స్టేజి ఎక్కిందంటే తన గలగల మాటలతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తూ పోతుంది. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క హీరోల సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ లకి, ఇంటర్వ్యూ లకి ఆమె పనిచేస్తుంది.
ఇక యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల గురించి కూడా ఇక్కడ పరిచయం అక్కర్లేదు. రాజీవ్ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు ఉన్న నటుడే కాదండోయ్, ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే గతంలో సుమ రాజీవ్ కనకాల ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు చాలాసార్లు వినిపించాయి. అయితే వీరు విడాకుల వరకు వెళ్లడానికి ప్రధాన కారణం ఓ హీరోయినట. అవును, వినడానికి విడ్డురంగా వున్నా అదే నిజమని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ లో చేస్తున్న ఓ హీరోయిన్ రాజీవ్ ఎఫైర్ పెట్టుకోవడం వలెనే సుమ విడాకులు తీసుకోవాలని చూసిందట.
అయితే, ఇంట్లో పెద్దవాళ్ళ ఇచ్చిన సలహా మేరకు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అదే విధంగా తన భర్తకు ఉన్న చెడు అలవాటుని కూడా విజయవంతంగా మాన్పించుకొని తన విడాకులు ఆలోచనలు విరమించుకొని మళ్ళీ ఎప్పటి లాగే తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉందని ఇన్సైడ్ టాక్. ఇకపోతే రాజీవ్ కనకాలకు ఆ మధ్య కాలంలో ఎక్కువగా ఆఫర్స్ రాకపోవడానికి కారణం కూడా ఆ హీరోయిన్ తో ఎఫైరేనని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. అయితే రాజీవ్ కనకాల ప్రస్తుతం పూర్తిగా మారిపోయాడని అలా మారిపోయాకే సుమా తనని భర్తీగా అంగీకరించిందని కూడా చెప్పుకుంటున్నారు.
ఇక తాజా సమాచారం ఏమంటే… ఈ విషయంలో మన సూపర్ స్టార్ మహేష్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని టాక్ నడుస్తోంది. ఈ విషయమై కొన్నాళ్ల క్రితం యాంకర్ సుమ-రాజీవ్ ఇంటికి వెళ్లి మహేష్ షాకిచ్చాడట. మొదట విషయం అర్ధం అవ్వని సుమ, రాజీవ్ చాలా కలుపుగోలుగా మహేష్ ని ఇంటికి ఆహ్వానించారట. ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని బిక్కముఖం వేసారట. వారు విడాకులు విరమించుకోవడంలో మహేష్ పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఇకపోతే ప్రిన్స్ మహేష్ బాబుని యావత్ తెలుగు పరిశ్రమలోనే పర్ఫెక్ట్ ఫామిలీ మ్యాన్ అని అంటూ వుంటారు.