డ్యాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన ప్రభుదేవా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీలలో పేరు తెచ్చుకున్నాడు. ఈ డ్యాన్స్ మాస్టర్ వెన్నెలవే వెన్నెలవే, ముక్కాలా ముక్కాబులా, ఊర్వశి ఊర్వసి సాంగ్స్ లో అదిరిపోయే స్టెప్పులు వేసి ఇండియన్ మైకల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు అదిరిపోయే కొరియోగ్రఫీలతో చిరంజీవి, హృతిక్ రోషన్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ పై మంటలు పుట్టించాడు. అయితే ఇప్పటివరకు మహేష్ బాబు, ప్రభుదేవా కలిసి కొలాబరేట్ అయిన దాఖలాలు లేవు.
కాగా రీసెంట్‌గా మహేష్ బాబును ప్రభుదేవా కలిశాడట. అప్పటిదాకా మహేష్ బాబు పై ప్రభుదేవాకి చెడు అభిప్రాయం ఉందట. అతన్ని మీట్ అయి కాసేపు మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం మొత్తం మారిపోయిందని ప్రభుదేవా సన్నిహితులతో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఎవరితోనూ పెద్దగా మాట్లాడుకుండా మహేష్ చాలా ఆటిట్యూడ్‌తో ఉంటాడని మొన్నటిదాకా ప్రభుదేవా అనుకునేవాడట. అలా అనుకోవడం ఎంత పెద్ద తప్పో రీసెంట్‌గా ప్రభుదేవా కి తెలిసొచ్చిందని సమాచారం.
అంతేకాదు మహేష్ చిన్నపిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఎంతగా కృషి చేస్తున్నాడో తెలుసుకొని అతను కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట. మహేష్ లాంటి డౌటు ఎర్త్, మంచి మనసున్న హీరోను తాను ఇప్పుడు కలవలేదని ఈ డాన్స్ మాస్టర్ ఎమోషనల్ అయినట్లు సమాచారం. కాగా ప్రభుదేవా చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహేష్ తోటి ప్రభుదేవా ఎప్పటికీ మర్చిపోని స్టెప్పులు వేయించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.