జ్యేష్ఠ పౌర్ణమి నాడు కుమారులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం చేసి తీరాల్సిందే..

తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈరోజున అన్నదానం చేయడంతో పాటు ప్రవహించే నదిలో స్నానాలు చేస్తే పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. ఈ ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి శనివారం నుంచే ప్రారంభమవుతుంది. శనివారం నాడు (జూన్ 3) ఉదయం 11 గంటల 16 నిమిషాల తర్వాత పౌర్ణమి తిధి ప్రారంభమవుతుంది. ఈ పౌర్ణమి ఆదివారం రోజు ఉదయం 9 గంటల 11 నిమిషాలకు ముగుస్తుంది. ఈ పౌర్ణమి నాడు అనురాధ నక్షత్రం రాత్రంతా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు లక్ష్మిదేవి, సత్యనారాయణ స్వాములను పూజిస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.

ఇక కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఇంటి గుమ్మం ముందు 9 గంటల 15 నిమిషాలలోపు ఒక పరిహారం చేస్తే వారి పిల్లల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే, కుమారుడు ఉన్న తల్లి ఆదివారం రాత్రి 9:15PM లోగా తమ ఇంటి గడపకు పసుపు రాసి దానికి కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత గడపకు రెండు వైపులా అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఆపై ఎలాంటి మచ్చలు, రంధ్రాలు లేని తాజా రావి ఆకులను తీసుకురావాలి. ఇరువైపులా వేసిన ముగ్గుల మధ్యలో చక్కని రెండు రావి ఆకులను ఉంచాలి. అనంతరం ఆకులపై రెండు ప్రమిదనలను ఒకదానిపై ఒకటి పెట్టాలి. అంటే గుమ్మానికి ఇరువైపులా రావి ఆకులపై ప్రమిదలో ప్రమిద రెండు ప్రమిదలను పెట్టాలి.

ఈ ప్రమిదల చుట్టూ డెకరేషన్ చేసి వాటిలో విప్ప నూనె పోయాలి. ఆపై ఒత్తి పెట్టి దానిని వెలిగించాలి. ఈ విప్ప నూనె ద్వీపం ద్వారా వచ్చే పొగ మీ కొడుకుల యశోవృద్ధికి దోహదపడుతుంది. వారికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. మీ కొడుకులు జీవితంలో ఉన్నత స్థాయిలలో స్థిరపడేందుకు ఈ పరిహారం సహాయపడుతుంది. అంతేకాదు మీ కుమారులు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పొందుతారు. కాబట్టి కుమారులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయడం మంచిది.