Heroine: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లు ఇప్పుడు త్వరగా పెళ్లిలు చేసుకొని సెటిల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది సీనియర్ హీరోయిన్లు మాత్రం 50 ఏళ్లు వచ్చినా కూడా పెళ్లికి మాత్రం దూరం అంటున్నారు. ఇక అలాంటి వారిలో నటి సితార కూడా ఒకరు. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయస్థరాలైన ఈమె అటు కన్నడ, ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించుకుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించే సితారకు ఎక్కువగా ఆఫర్లు ఇవ్వడానికి కూడా కారణం ఇదే అని చెప్పవచ్చు.
కన్నడ, తెలుగు అని తేడా లేకుండా అందరికీ దగ్గరైన సితార జీవితంలో మాత్రం కొన్ని విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. సితార మాతృభాష మలయాళం అయినప్పటికీ కన్నడ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కన్నడలో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఆ తర్వాత తెలుగు , తమిళ్, మలయాళం భాషల్లో కూడా మెప్పించింది. ప్రస్తుతం ఈమె వయసు 46 సంవత్సరాలు కానీ వివాహం అనే పదానికి ఇంకా దూరంగానే ఉంది.
ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార ఎన్నో విషయాలను పంచుకుంది. కేరళలోని కిలిమనూర్ లో సితార జన్మించింది ఈమె తల్లిదండ్రుల పేర్లు రామేశ్వరన్ నాయక్ వల్సల నాయర్. కాలేజీలో చదువుతున్నప్పుడే సినిమాల్లోకి ప్రవేశించిన ఈమె తాను వివాహం చేసుకోక పోవడానికి గల కారణాన్ని వివరించింది. నాన్నగారు అంటే చాలా ఇష్టం . ప్రతి విషయంలో కూడా సపోర్టుగా నిలిచేవారు. నేను చేసే ప్రతి పనిలో కూడా ఆయన సలహా తీసుకునే దాన్ని.
అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరం అయ్యాను. అటు తరువాత పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు ఇక నా భవిష్యత్తులో అలాంటి ఆలోచన గనుక ఉంటే మాత్రం తప్పకుండా తెలియజేస్తాను అంటూ తెలిపింది. సితార చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.