Chiranjeevi: ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో నిలిచిన సాంగ్ ఏది అంటే..’జంబలకడి జారు మిఠాయ’ పాత.. జానపదాలకు ప్రస్తుత తరం దూరం అవుతున్న నేపథ్యం లో తమ ఊరికి చెందిన ఇద్దరు సింగర్స్ ని వెలుగులోకి తెచ్చారు మోహన్ వారి పాటలను మంచు విష్ణు తన చిత్రం లో పెట్టుకున్నాడు. అదే‘జంబలకడి జారు మిఠాయ’ పాట.. పల్లె పాటలు బయటకు తీసుకువచ్చి వాళ్ళ పాటను బతికించుకోవాలి అనుకున్న భారతమ్మా , నాగరాజుమ్మలకు అనుకున్న గుర్తింపు రాకపోవడం బాధాకరం..

ఇలాంటి వారిని గౌరవించుకోవాలి. గౌరవించాల్సిన వాళ్లకు గౌరవం ఇవ్వాలి.. అనేది మీమర్స్, ట్రోలర్స్ గుర్తుంచుకోవాలి. ఇలాంటి కల్మషం లేని మనుషులను ట్రోల్ చేస్తున్నందుకు సిగ్గుపడాలి. ఒక కొత్త టాలెంట్ బయటికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వేలో జనాల్లోకి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. ట్రోల్ చేసే ఒక్క నిమిషం ముందు ఆలోచించినా.. ఎక్కడో వెంకటగిరి ప్రాంతం నుండి వచ్చిన మారుమూల జానపదం జారు మిఠాయి పాట వెనకున్న భారతమ్మ, నాగరాజమ్మలు ఇంత నెగటివిటీని ఫేస్ చేసేవారు కాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. జారు మిఠాయి అనే జానపద పాటను, ఆ పాటను పుట్టించిన భారతమ్మ, నాగరాజమ్మలను నెటిజన్స్, ట్రోలర్స్ గుర్తించకపోయినా.. మంచు ఫ్యామిలీ గుర్తించి, వాళ్లకు అవకాశం ఇచ్చినందుకు మంచు ఫ్యామిలీని అభినందించాలి. ఈ జారు మిఠాయి అనే పాటకు సినిమాటిక్ టచ్ ఇచ్చి.. అనూప్ రూబెన్స్ వేరే సింగర్ తో సినిమా కోసం పాడించాడు. ఆ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికీ జారు మిఠాయి సాంగ్ పాడిన ఆ భారతమ్మ, నాగరాజమ్మలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
జారు మిఠాయి అనే జానపద పాటను, ఆ పాటను పుట్టించిన భారతమ్మ, నాగరాజమ్మలను మెగాస్టార్ చిరంజీవి సన్మానించాలని అనుకుంటున్నారు నీ వయసులో కూడా వాళ్ళిద్దరూ జానపద పాటలను కాపాడుకోవడం కోసం ఒక అడుగు ముందుకు వేశారు వాళ్ళ ఆలోచనలు వారి వయసును గుర్తించి చిరంజీవి వాళ్లకి సన్మానం చేయాలని దాంతో వారి మీద ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుంది అన్న సద్విద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. ఈ విషయం తెలిసి మెగా ఫాన్స్ తో పాటు నేటిజన్లు కూడా సంతోషిస్తున్నారు..