ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా ప్రస్తావన అవసరం లేదు. టాలీవుడ్లో మొదట స్టైలిష్ స్టార్ గా పేరుతెచ్చుకున్న అల్లు అర్జున్ కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ పరిశ్రమలో కూడా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అనతికాలంలోనే పుష్ప అనే సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారి ‘ఐకాన్ స్టార్’గా అవతరించాడు. ఇపుడు పుష్ప2 సినిమాతో ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్న బన్నీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అభిమానులను మరింత టెన్షన్ పెడుతున్న పరిస్థితి వుంది.
అవును, ఇదే విషయం ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. విషయం ఏమిటంటే బన్నీ జాతకంలో పెద్ద దోషం ఉందని, పరిహార పూజలు చేయకపోతే సినిమా కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది అని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు అల్లు ఫ్యామిలీతో చెప్పాడట. ఈ క్రమంలోనే హఠాత్తుగా రాత్రికి రాత్రి అల్లు అర్జున్ అమ్మగారు బన్నీ జాతకంలో దోషాలు తొలగించడానికి పరిహార పూజలు చేయించడానికి పూనుకుందట. అల్లు ఫామ్ హౌస్ లో బన్నీ, స్నేహ రెడ్డి, అల్లు అర్హ, అల్లు అయాన్ నలుగురు ఈ పూజలో పాల్గొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇంకో విషయం ఏమిటంటే రాబోయే రోజుల్లో బన్నీ జాతకం ప్రకారం… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలబోయే రారాజు ఇతడే అని.. ఆ కారణంగానే నర దిష్టి ఆయనపై ఎక్కువగా ఉందని, ఆ దోష పరిహారంలో భాగంగానే ఈ ప్రత్యేక పూజలు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ ప్రత్యేక పూజలు వలన బన్నీ నెంబర్ వన్ హీరోగా ఎదగడమే కాకుండా ఆయన కెరియర్ కు కూడా ఎంతో ప్లస్ అవుతుందని పంతులు చెప్పడంతో అల్లు అర్జున్ అమ్మగారు ఇలాంటి నిర్ణయం తీసుకొని సదరు పూజలు చేయించారని వినికిడి.
ఇక బన్నీ సినిమా విషయాలకొస్తే, సుకుమార్ కాంబోలో పుష్ప 2 షూటింగ్ శరవేగంగా చేస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమానుండి ఈపాటికే విడుదలైన ‘వేరీజ్ పుష్ప’ వీడియో యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ సినిమాలు వరుసగా లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. పుష్ప తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో అల్లు ప్రధాన పాత్రలో నటించగా, ఇతర నటీనటులు అయినటువంటి గౌరవ్ పరీక్, మోనోజిత్ షిల్, అమన్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు వినికిడి. ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్‌తో కలిసి GA2 పిక్చర్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తుండగా, శాండీ స్వాతి నట్టి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వలో ఓ ప్రెస్టీజియస్ సినిమా రాబోతోంది. ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ సందీప్ సింగ్ వంగాతో తాజాగా కరచాలనం చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత సందీప్ దర్శకత్వంలో యానిమల్, స్పిరిట్ వంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆ తరువాతే అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని చిరకాలం గుర్తుండిపోయేలా సందీప్ తెరకెక్కించనున్నాడని భోగట్టా!