Vizag: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం వల్లాదిపేటకు చెందిన పైడి రాజుకు, నాగజ్యోతితో కొన్నాళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త టైల్స్ కాంట్రాక్టులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా నాగజ్యోతికి అదే ఏరియాకు చెందిన శ్రీనివాసరావుతో ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. అది రాజుకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని నాగజ్యోతిని పలుమార్లు హెచ్చరించాడు. కానీ తన పద్ధతి మార్చుకోలేదు. ప్రియుడుతో తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన జ్యోతి.. పైడిరాజును చంపేయాలని ప్లాన్ చేసింది..
ప్లాన్ ప్రకారం.. తన భర్తను చంపడానికి ప్రియుడ్ని రంగంలోకి దించింది జ్యోతి. ఇద్దరూ కలిసి ఇంట్లోనే మంచం మీద పైడి రాజును హత్య చేశారు. ఇక అతని మృత దేహాన్ని బైక్ పై తీసుకెళ్లి కైలాసగిరి శ్మశానవాటికలో దహనం చేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహారం కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల తరువాత తన భర్త కనిపించడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చిన జ్యోతి తను చెబుతున్న మాటలకు.. చేతలకు పొంతన లేకపోవడంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాగజ్యోతితో పాటు ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకెళ్లడంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు.