Walteru: మెగాస్టార్ చిరంజీవి శృతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో రూపొందించిన వాల్తేర్ వీరయ్య సినిమా నేడు గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలయ్యింది.. బాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. మత్సకారుడైన చిరంజీవికి అతని స్నేహితుడు, అహంకారి అయిన ఏసీపీగా నటించిన రవి తేజ మధ్య జరిగే స్టోరీ నే ఈ సినిమా కథ.. ఇందులో కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కాగా జీకే మోహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమా కథ మెగాస్టార్ చిరంజీవికి టైలర్ మేడ్ క్యారెక్టర్. ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ అంశాలతో ఎంటర్టైనింగ్ సాగుతుంది. రవితేజ, చిరంజీవి మధ్య సన్నివేశాలు పవర్‌పుల్‌గా ఉన్నాయి. శృతిహాసన్ గ్లామర్ పరంగాను, పాటల్లో స్టెప్పులతో ఆలరించింది. సెకండ్ హాఫ్ లో బ్రదర్ సెంటిమెంట్ చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని బాబి ఆ విధంగా ఆ సీన్స్ రాశారని తెలుస్తోంది. సంక్రాంతికి చిరుయే విన్నర్ అని, కమర్షియల్ ఎంటర్టైనర్ రేంజ్ ఎలా ఉంటదో బాస్ చూపిస్తడు.. ఆ కామెడీ టైమింగ్, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ చూశాక.. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అనేది మళ్లీ మళ్లీ అనాల్సి వస్తుంది అని మరో నెటిజన్ కామెంట్ పెట్టేశాడు.. మొత్తానికి ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.