Anasuya: అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.. జబర్దస్త్ షో తో తన అదృష్టాన్ని మార్చేసుకుంది అనసూయ.. హీరోయిన్ కాకపోయినా స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.. ఇటీవల శ్రీకాళహస్తిలో గ్లామర్ బ్యూటీ సందడి చేయగా.. తాజాగా తమిళ నాడు లో ఓ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్త తెగ వైరల్ అవుతున్నాయి..
గ్లామర్ బ్యూటీ అనసూయ ఎర్ర చీర కట్టుకుని తళుక్కుమంది.. ఇక ఆ ఈవెంట్ లో ఓ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసింది. అది తన ఇన్స్త గ్రామ్ స్టేటస్ లో పెట్టింది.. ఇక రెడ్ సారీ లో కొన్ని ఫోటోలు వదలగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ ఓవైపు టీవీ షోలను హోస్ట్ చేస్తూనే.. మరోవైపు చిన్న సినిమాల నుండి పాన్ ఇండియా సినిమాల వరకు అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటిగా మారిపోయింది. అనసూయ ఏ చిన్న పోస్ట్ చేసిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అది అనసూయ రేంజ్.. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంది.