Varasudu: వారసుడు సినిమా ఆన్ లైన్ రిలీజ్ – డేట్ ఎప్పుడంటే !

Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ చిత్రం వారసుడు ఈ సినిమా థియేటర్స్ లో విడుదల మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. తమిళంలో ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్లను వసూలు చేస్తుంది కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో నిలిచింది.. వారసుడు సినిమా వచ్చే నెలలోనే ఓటీటీ లోకి రాబోతున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.

Vijay thalapathi varasudu ott release date viral
Vijay thalapathi varasudu ott release date viral

తమిళంలో జనవరి 11న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకకెక్కిన వారిసు సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. థియేటర్లలో రిలీజ్ అయిన 30 నుంచి 40 రోజుల గ్యాప్ లోనే ఓటీడీలో రిలీజ్ చేసేలాగా నిర్మాతతో అమెజాన్ ప్రైమ్ ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

ఆ కారణంగానే ఫిబ్రవరిలోనే ఈ సినిమాను ఓటీడీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో అమెజాన్ ప్రైమ్ లో వారిసు స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళం తో పాటు తెలుగు వర్షన్ కూడా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాకింగ్ సొంతం చేసుకుంది.  వారీసు సినిమా తమిళంలో అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకుంటుంది.

 

తమిళంలో ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల మైలు రాయిని దాటింది. విజయ్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో వారసుడు ఒకటిగా నిలిచింది. తెలుగులో వారసుడు ఈ శనివారం విడుదలైంది. మొదటి రోజు తెలుగులో మూడు కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.