Prabhas: వద్దు రా బాబు మాకు ఆ సినిమా రిలీజ్ ఆపేయండి ” గోల గోల చేస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ ! 

Prabhas:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. వాస్తవానికి ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాలతో జూన్‌కు వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వివాదంలో చిక్కుకుంది..

Prabahs fans request stop adipurush movie release because
Prabahs fans request stop adipurush movie release because

ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. ఈ టీజర్ లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ కొంతమంది ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక అలాగే మరి కొంతమంది ఈ సినిమా టీజర్ అసలు బాలేదని.. ఇదో యానిమేషన్ సినిమాలో ఉందని భారీగా ట్రోలింగ్ గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.. ఇది ఇలా అంటే ప్రస్తుతం గ్రాఫిక్ పనులను సక్రమంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మరోసారి వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

 

అలహాబాద్ హైకోర్టు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు నుంచి సమాధానం కోరింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వాజ్యంపై ప్రత్యుత్తరం దాఖలు చేయాల్సిందిగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అండ్ సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేయడం జరిగింది.

 

సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ను పొందకుండానే చిత్ర యూనిట్ ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల చేశారు. అంతేకాకుండా సీత పాత్రలో నటించిన కృతి సునందరించిన కాస్ట్యూమ్స్ పై కూడా ఈ పిటిషన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివరాలను కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో వారు పేర్కొన్నారు. దాంతో ఈ పిటిషన్ స్వీకరించిన కోర్ట్ తరవాత విచారణ ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది. మరి ఇక కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి.

 

ఈ సినిమా జనవరి 12న విడుదల కావాల్సి ఉంది కానీ.. 2023 జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది.. ఇదంతా చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇక ఈ సినిమా గోల మాకు వద్దంటే వద్దు అంటూ గొడవ గొడవ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇలాంటి న్యూస్ లు వినే కంటే ఈ సినిమా రిలీజ్ ను ఆపేసేయండి.. ఈ సినిమా రిలీజ్ చేయకండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గొడవ చేస్తున్నారు.