Esther: విక్టరీ వెంకటేష్ మీనా జంటగా నటించిన దృశ్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో నటించిన చిన్నపిల్ల ఎస్తర్ అనిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా పార్ట్ వన్ లో ఈ అమ్మాయి కీలక పాత్ర పోషించింది.. 2014లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా సమయంలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తర్ అనిల్ వయసు 13 ఏళ్లు ఉంటాయి..
ఆ వయసులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఈ చిన్నారి 2021 దృశ్యం సీక్వెల్ లో నటించింది. ఈ సినిమా టైమ్ కి ఎస్తర్ యంగ్ బ్యూటీగా మారింది. హీరోయిన్ ఫీచర్స్ తో ఆకట్టుకునే రూపంలో ప్రేక్షకులకి చేరువయ్యింది. తెలుగులో జోహార్ అనే వెబ్ మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది .
అందుకు తగ్గట్టుగానే ఎస్తర్ పొట్టి పొట్టి డ్రెస్సులలో హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటోలతో మాయ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్ముడు పెట్టే ఫోటోలకి లక్షలు వ్యూస్ వస్తుంటాయి. ఈ చిన్న దానికి సరైన ప్రాజెక్టు ఒకటి పడితే హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవడానికి సై అంటుంది.
డైరెక్టర్స్ ని అట్రాక్ట్ చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉంది. ఎస్తర్ ప్రస్తుత వయసు 21 ఏళ్లు. తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్ లో మిరాకిల్ చేసింది. వీటిని ఫొటోస్ ను ఏకంగా లక్షలకు పైగా వీక్షకులు చూడడం విశేషం. ఈ బ్యూటీ సోయగాలు చూసిన తర్వాత దర్శక నిర్మాతలు అమ్మడికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. మొత్తానికి ఎస్తర్ హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తుందనే చెప్పొచ్చు.