Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు చిరంజీవి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ వార్త విన్న మెగా ఫాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగితేలుతున్నారు అయితే తాజాగా వీళ్ళ పిల్లల విషయం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

2012లో పెళ్లి చేసుకున్న ఉపాసన రామ్ చరణ్ వాళ్ళ మొదటి సంతానం కోసం సుమారుగా 10 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదాలతో తమకి వారసుడు వస్తున్నారని మెగాస్టార్ ఆనందంగా చెప్పారు. అయితే మెగాస్టార్ మనవడి పేరు ఏం పెట్టాలని ఇంట్లో వాళ్ళందరూ చర్చించుకుంటున్నారట..
మెగాస్టార్ కచ్చితంగా హనుమంతుడి పేరు పెట్టి తీరాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట. హనుమంతుడికి రిలేటెడ్ గా వచ్చే పేరుని ఏదో ఒకటి చూసి పెట్టాలని ఆయన భావిస్తున్నారట. కానీ ఉపాసన మాత్రం పిల్లలు పుట్టే పేరు నక్షత్రం జాతకం ప్రకారం అలాగే న్యూమరాలజీ ప్రకారం మాత్రం పేరు పెట్టాలని అనుకుంటుందట. ఈ విషయమై ఇంట్లో ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయని వారి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.
ఈ విషయంలో ఉపాసన కూడా వెనకడుగు వేయడం లేదని టాక్. మామ మాటకు మొదటిసారి ఉపాసన ఎదురు తిరగకపోయినా కానీ తను అనుకున్నట్లుగానే పేరు పెట్టాలని అనుకుంటుందట. ఇక ఇద్దరూ అనుకుంటున్నట్లుగా రెండు పేర్లను కలిపి పుట్టే బిడ్డకు పెడితే సరి అని నెటిజన్స్ సలహా ఇస్తున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.