Balakrishna: ఈ సంక్రాంతికి భారీ ఎత్తున నాలుగు పెద్ద సినిమాలు సౌత్ లో రిలీజ్ అయ్యాయి. కోలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వగా.. టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోల సినిమాలు ఒకరోజు గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. అది మన హీరోలకు కలిసి వచ్చి ఓపెనింగ్స్ పరంగా మొదటి రోజు మన హీరోల సినిమాలు రికార్డులను నమోదు చేశాయి..

అన్ని సినిమాల మీద బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఓపెనింగ్స్ లో 2023 సంక్రాంతి సినిమాలలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ సృష్టించింది 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ ప్లేస్ లో నిలిచింది. ఒకసారి అన్ని సినిమాల మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ గమనిస్తే వీరసింహారెడ్డి నే టాప్ లో నిలిచింది..
వీర సింహారెడ్డి – 50.10 కోట్లు
వాల్తేరు వీరయ్య – 49.10 కోట్లు
వారిసు – 47.52 కోట్లు
తూనీవు – 41 కోట్లు
మొత్తం సినిమాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో బాలయ్య ముందంజలో ఉన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమాల కలెక్షన్స్ పరంగా బాలయ్య ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. సౌత్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ లో బాలయ్య అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన హీరోగా రికార్డులకెక్కారు.
ఆ తరువాత రోజు వీర సింహరెడ్డి సినిమా కలెక్షన్స్ కాస్త తగ్గాయి అందుకు మెగాస్టార్ చిరంజీవి నుంచి వాల్తేరు వీరయ్య విడుదల కావడం కానీ ఆ తరువాత నుంచి బాలయ్య మళ్ళీ పుంజుకున్నారు కలెక్షన్ల వేట మొదలెట్టరు ఎలా చూసుకున్నా కానీ బాలయ్య ముందంజలోనే ఉన్నారు మొత్తానికి బాలకృష్ణ సౌత్ టాప్ కలెక్షన్ హీరోగా గుర్తుకు తెచ్చుకున్నారు.