Amaravathi : అమరావతి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వెంకయ్య నాయుడు !

Amaravathi : అమరావతి రాజధాని వ్యవహారం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంసమైంది.. అమరావతి రాజధాని అని మూడు రోజుల్లో గురించి తమను ఏపీ ప్రభుత్వం సంప్రదించలేదని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ చేసిన ప్రకటనతో మరోసారి ఏపీ రాజధాని అమరావతిపై తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది.. తాజాగా ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు..


పశ్చిమగోదావరి జిల్లాలలోని ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సమావేశంలో వెంకయ్య నాయుడుకి రాజధానిపై ప్రశ్న వేగా.. నేను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని.. కానీ అమరావతి పై తన అభిప్రాయం గతంలో చెప్పానని ఆయన అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి అనుకోవాలా.. లేదంటే విశాఖ అనుకోవాలా అని ఓ విద్యార్థి వెంకయ్య నాయుడుని ప్రశ్నించగా.. తాను కేంద్రమంత్రిగా ప్రధానితో కలిసి అమరావతి శంకుస్థాపనలో పాల్గొన్నానని.. పట్టణ అభివృద్ధి మంత్రిగా అమరావతికి నిధులు కూడా మంజూరు చేశానని గుర్తు చేశారు. ఇప్పటికే రాజధానిపై తన స్టాండ్ ఏమిటో అర్థం అయి ఉంటుందంటూ వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంసమయ్యాయి.

Venkaiah Naidu sensational comments on amaravati
Venkaiah Naidu sensational comments on amaravati

ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు వెంకయ్య నాయుడు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోవునని.. వాటిపై ఆసక్తి లేదని ఆయన గతంలోనే ప్రకటించారు. కానీ అనూహ్యంగా విద్యార్థుల నుంచి అమరావతిపై ప్రశ్న ఎదురు కావడంతో వెంకయ్య అమరావతి రాజధాని అని పరోక్షంగా జవాబు ఇచ్చినట్లు అర్థమవుతుంది.