RamCharan : రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని తల్లి కావడం లో భారీ ట్విస్ట్ !

RamCharan టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్స్ లో ఉపాసన రామ్ చరణ్ కూడా ఒకరు.. ఈ జంటకు పెళ్లి 10 సంవత్సరాలు.. ఇటీవల ఉపాసన ప్రెగ్నెన్సీ అన్న విషయం అందరికీ అధికారికంగా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.. తల్లి కాబోతున్న ఉపాసన తిరుమలలో ఎంతో చక్కగా అన్నదానం చేసినట్లు తెలుస్తోంది..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇద్దరు కూడా శ్రీవారి సన్నిధిలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. తర్వాత సంతోషకరమైన కార్యం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉపాసన మెగా కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల వెళ్లడమే కాకుండా దగ్గరుండి మరి అక్కడ భోజనానికి వచ్చిన వారందరికీ తన స్వహస్తాలతో భోజనం వడ్డించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సేవ చేసి ఉపాసన దంపతులు తరించారు.

10 సంవత్సరాల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులు కావడంతో వారు మొక్కుకున్న మొక్కుబడులను శ్రీవారికి చెల్లించినట్లు సమాచారం. రామ్ చరణ్ తన సతీ సమేతంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం మెగా శకం నడుస్తోందని చెప్పచ్చు.

Upasana pregnancy special Pooja on ram charan
Upasana pregnancy special Pooja on ram charan

వారాహి గా పవన్ కళ్యాణ్ జనాల్లోకి ముందుకు వెళ్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఊచ కోత కలెక్షన్స్ తో మెగాస్టార్ మేనియా ఏంటో అందరికీ చూపించాడు. అలాగే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు చిరంజీవి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ గా మారారు. శంకర్ దర్శకత్వంలో మరో సక్సెస్ లో అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరోపక్క ఉపాసన తల్లి కాబోతోంది. ఇంతకంటే మంచి సంవత్సరం మెగా ఫ్యామిలీకి మరొకటి లేదని 2022 సంవత్సరం ఎన్నో ఆనందాలను తీసుకువస్తే.. 2023 మాత్రం అంతకుమించి ఆనందాలను మెగా ఫ్యామిలీలో తీసుకొస్తుంది. అనడంలో సందేహమే లేదు మెగా ఫాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.