టాలీవుడ్ కింగ్ నాగార్జునకి చురకలంటించిన హైకోర్టు… చూస్తూ ఊరుకోమంటూ నోటీసులు!

తెలుగు బుల్లితెరపై షో బిగ్‌బాస్ గురించి జనాలకి పరిచయం చేయనక్కర్లేదు. ముఖ్యంగా యువతకి దాని గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ షో టీవీలలో వచ్చిందంటే మనోళ్లు నోళ్లు జాపుకొని మరీ తన్మయత్వం చెందుతారు. అంతలా హాలీవుడ్ నుండి అరువు తెచ్చుకున్న షో ఇక్కడ పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ షో తెలుగులో 6 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకొని 7వ సీజన్ కు రెడీగా ఉంది. కాగా ఈ షో కు నాలుగు సీజన్లుగా హోస్ట్ గా చేస్తున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈసారి కూడా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇటీవలే ఈ సీజన్ కు సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేయడంతో దానికి జనాలనుండి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. నాగార్జున ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవును, ఇప్పుడు ‘బిగ్ బాస్’ సీజన్ 7కు కోర్ట్ నోటీసుల రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. దీంతో ఈ షో అభిమానులు మిక్కిలి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ‘బిగ్ బాస్’ షో అంటే ఇంటిళ్లపాది టీవీల ముందుకు వచ్చి కూర్చొని సరదాగా ప్రోగ్రాంను ఎంజాయ్ చేసేవారు. అయితే రానురాను బిగ్ బాస్ షో షేప్ మారిపోయింది. మొదట కొన్ని ఎపిసోడ్లు బానే ఉన్నా తర్వాత నుంచీ షో లో కంటెంట్ తక్కువై, శృంగార పాళ్ళు ఎక్కువైనాయి. ముద్దులు పెట్టుకోవడాలు, కౌగిలించుకోవడాలు… అడ్డమైన ప్రేమ కధలు మొదలయ్యాయి. దాంతో కొంతమంది ఈ షోపైన బహిరంగంగానే విమర్శలు చేసారు.

 

ముఖ్యంగా షో రేటింగ్ కోసం షో లో కంటెంట్ కంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయని విమర్శలు మొదలవ్వడంతో కథ మొదలయ్యింది. ముఖ్యంగా సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఈ షోను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఈ షో చూడటం వలన పిల్లలు, యువత చెడిపోతున్నారని మీడియాలు ముందు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘బిగ్ బాస్’ షోలో అశ్లీలత, అసభ్యత సన్నివేశాలు ఎక్కువయ్యాయని పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు షోను తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది. దాంతో కింగ్ నాగార్జున ఖంగు తిన్నారు.

అవును, ‘బిగ్ బాస్’ షో పై సీపీఐ నారాయణ వేసిన పిటిషన్ ను కోర్ట్ విచారించింది. ఈ మేరకు హోస్ట్ గా చేస్తున్న నాగార్జునకు అలాగే సదరు చానల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంతో ‘బిగ్ బాస్’ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనోళ్ళకి శృంగార రసం కావాలి మరి. అదేకదా తెచ్చింది అసలు చిక్కు. కాగా బిగ్ బాస్ షో కు గతంలో కూడా నోటీసులు వచ్చాయి. కానీ అప్పుడు షో లను మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా కంటిన్యూ చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈసారి కోర్టు ఆ షోని 4 వారాలకు వాయిదా వేయమని వేయడంతో తరువాత ఏమని తీర్పు చెబుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ 7 జరుగుతుందా లేదా అనేది కోర్ట్ తీర్పుపై ఆధారపడి ఉంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.