హైదరాబాద్‌లో వానల సంగతి గురించి మీరు రోజూ వినే వుంటారు. ఈరోజు కూడా అక్కడ బాదుడు మొదలైంది. దాదాపు 3 రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది. నాంపల్లి, కోఠి, లక్డీకపూల్, మాసబ్‌ట్యాంక్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్టా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, ఏఎస్ రావు నగర్, కొండాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట్, నీజాంపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, బాచుపల్లి, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో ఇపుడు వర్షం జోరుగా కుండపోత వర్షం కురుస్తోంది.
అవును, ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతా మేఘావృతమై వుంది. కాగా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా అక్కడ ఎడతెరిపి లేకుండా అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి ఉన్నాయని ఇప్పటికీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కే నాగరత్న తెలిపారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. విషయం ఏమిటంటే అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నారు.
ఈరోజు, రేపు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయా జిల్లాలకు ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగిపోయింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అదేవిధంగా శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక అసలు విషయానికొస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇల్లు కూడా వరదల్లో చిక్కుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో ఈ విషయంపైన ఫోకస్ పెట్టిన ఏపీ మంత్రి రోజా తెలంగాణ ప్రభుత్వం సాయంతో మహేష్ ఇంటి చుట్టుపక్కల నీటిని క్లియర్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దాంతో ఘట్టమనేని అభిమానులు మంత్రి రోజాకు థాంక్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.