తండ్రికి తగ్గ కూతుళ్లు అని వారిని మెచ్చుకున్న హీరో రామ్ చరణ్… ఎవరినో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పేదేముంది. ఇపుడు ఆయన ఒక పాన్ ఇండియా రేంజ్ వున్న హీరో అయిపోయాడు. RRR సినిమా తరువాత మనోడి జాతకం మారిపోయింది. అందరి దృష్టిలో సూపర్ హీరో అయిపోయాడు. అంత పెద్ద సక్సెస్ తరువాత ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. కానీ మన మెగా హీరో మాత్రం తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా కష్టపడుతున్నాడు. అవును, ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగులో బిజీగా వున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈమధ్యనే రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి విదితమే. అయినా క్షణం తీరికలేకుండా చరణ్ షూటింగ్ లొకేషన్లో కష్టపడుతున్నాడని వినికిడి. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి అందరికీ విదితమే. ఈ స్టార్ కిడ్స్ తెలియనివారు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ వుండరు. ఎందుకంటే వీరు అడపాదడపా సోషల్ మీడియాలో చిచ్చర పిడుగుల్లాగా మెరుస్తూ వుంటారు. అల్లు అర్హ కంటే సితార పెద్దది. కానీ ఇద్దరి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇద్దరు తమ తండ్రులకు మల్లే మంచి కళా పోషకులు. సితార డాన్సులు సందడి గురించి అందరికీ తెలిసినదే. అదేవిధంగా అల్లు అర్హ తన నాన్న అల్లు అర్జున్ తో చేసిన అల్లరి చేష్టలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనకు తారసపడుతూ ఉంటాయి.

విషయం ఏమంటే… తాజాగా వీరిద్దరినీ చాలా క్లోజ్ గా చూసిన రామ్ చరణ్ చాలా మురిసిపోయాడట. తండ్రులకు తగ్గ తనయలని వారిని ఆకాశానికెత్తేశాడట. ఇక సితార పాప చేసిన ఓ షార్ట్ ఫిలిం చూసి దాదాపు అవాక్కయ్యాడట. ఇవే విషయాలను వారి సన్నిహితుల దగ్గర చెబుతూ పొగిడితే… నీకు కూడా ఈమధ్యే పాప పుట్టింది కదా. అదేమన్నా తక్కువ తింటుందా? మెగా వారసురాలు ఇంకా ఇరగదీస్తోంది కావాలంటే వేచి చూడండి… అంటూ వాళ్ళు అన్నారట. ఆ మాటలతో మన రామ్ చరణ్ చాలా ఆనందం పడిపోయాడట. కాగా సినిమా షూటింగుల్లో బిజీ అయినటువంటి చరణ్ తన ప్రిన్స్ ‘క్లిన్ కార’ని చాలా మిస్ అవుతున్నాడని టాక్.

ఇకపోతే, పాప పుట్టి ఇంకా నెల రోజులు దాటకుండానే అపుడే మెగా ప్రిన్స్ కి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించిందట రామ్ చరణ్ భార్య ఉపాసన. ఆమధ్య ఆ విషయాన్ని తెలుపుతూ ఓ వీడియో కూడా విడుదల చేసింది ఉపాసన. ఇక ఆ వీడియోని చూస్తే మనకి ఒక అందమైన అనుభూతి కలుగుతుంది. తన కూతురు వున్న గదిని ఆమె చాలా ప్రత్యేకంగా అలంకరించారు. ఆమె ఒక అందమైన ప్రపంచంలో జీవించాలని, ఆహ్లాదంగా ఉండాలని అలా ప్లాన్ చేశారట. పిల్ల ఇంకా పుట్టి నెల రోజుల కాకుండానే చూడండి ఎలా కేర్ తీసుకుంటుందో అని మెగాస్టార్ సతీమణి సురేఖ చిరుతో ఆ విషయాన్ని చెబుతూ మురిసిపోయిందట. ఇకపోతే మన మెగాస్టార్ చిరు నటించిన సినిమా బోళా శంకర్ ట్రైలర్ సినిమా తాజాగా రిలీజై యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ ని రాబట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే. మెగాస్టారా మజాకానా!