తాపంతో రగిలిపోతున్న ఏఐ.. నీటిని గడగడా తాగేస్తుంది?

ఓపెన్ ఏఐ సృష్టించిన చాట్ జిపిటి గురించి నేటి తరానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొద్ది నెలలుగా ఇంటర్నెట్ ప్రపంచంలో ఇది ప్రభంజనాలు సృష్టిస్తోంది. ప్రతిరోజు బిలియన్ల సంఖ్యలో దీనిని వాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దీని వలన కలిగే ఉపయోగాలు సంగతి పక్కన బెడితే ఫ్యూచర్‌లో జరగబోయే నష్టాల గురించి కొంతమంది మేధావులు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న చాట్‌జీపీటీ.. ఒక్కో కన్వర్జేషన్‌కు 500 మి.లీ. నీటిని తాగేస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో రివర్‌సైడ్ మరియు యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్టన్ పరిశోధనలో ఈ భయంకర ఫలితాలు వెలువడ్డాయి.

అవును, టెక్సాస్ మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన అత్యాధునిక యుయస్ డేటా సెంటర్‌లో ట్రైనింగ్ జిపిటి 3 దాదాపు 7,00,000 లీటర్ల నీటిని రోజు వినియోగిస్తుందని సమాచారం. ఆసియాలోని డేటా సెంటర్‌లలో ఈ సంఖ్య 3 రెట్లు అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఓపెన్ ఏఐతో సహా దాదాపు అన్ని పెద్ద టెక్ సంస్థలు ప్రస్తుతం గూగుల్ బార్డ్, మెటాస్ లామా ఇలాంటి ఏఐ మోడ్‌లపై పని చేస్తుండడం కొసమెరుపు. ఈ ఏఐ మోడల్‌లకు శిక్షణ ఇచ్చే ప్రక్రియ దాదాపు ఒకే విధంగా ఉన్నందున ఈ ఏఐ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా లాజిక్ అదే విధంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

కాగా ఓపెన్ ఏఐ చాట్ జిపిటి వంటి ఏఐ మోడల్ వాటర్‌ ఫుట్‌ప్రింట్ ప్రాథమికంగా మోడల్‌ను హోస్ట్ చేసే, అమలు చేసే సర్వర్‌లు, డేటా సెంటర్‌లకు శక్తిని అందించడానికి అవసరమైన శక్తి వినియోగంతో ముడిపడి ఉంటుంది. ఈ డేటా సెంటర్స్‌కు కూలింగ్ సిస్టమ్స్, ఎనర్జీ ఇంటెన్సివ్ కంప్యూటింగ్ రీసోర్సెస్ అనేది చాలా అవసరం ఉంటుంది, అది తప్పనిసరి కూడా. ఇవి కూలింగ్ వాటర్, విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి వినియోగానికి దోహద పడతాయన్నమాట. ఏఐ మోడల్స్ వాటర్ ఫుట్‌ప్రింట్.. సెంటర్స్ ఉపయోగించే శక్తి మిశ్రమం, శీతలీకరణ పద్ధతులతోపాటు హార్డ్‌వేర్ ఎఫిషియన్సీపై ఆధారపడి వుంటుందనే విషయం మీరు చదువుకునే వుంటారు. అందుకే ఇలాంటి ఏఐ టక్నాలజీ వంటివి అధికమొత్తంలో నీటిని తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.