Railway Jobs : వేల సంఖ్యలో రైల్వే ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..!!

Railway Jobs : నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాలను విడుదల చేస్తూనే వుంది. అయితే ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు రైల్వే సంస్థ నుండి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈస్ట్రన్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో 2972 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). మొత్తం ఖాళీల సంఖ్య-2972 ఇందులో హౌరా డివిజన్లో-659, లీలుహ్ డివిజన్-612, సిల్దా డివిజన్-297, కంచర పర డివిజన్-187, మల్దా డివిజన్-138, అసన్సోల్ డివిజన్-412, జమాల్ పూర్ డివిజన్-667 పోస్ట్ లు కలవు.

Thousands of railway jobs
Thousands of railway jobs

2). అర్హతలు : పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కనీసం 50 శాతం మార్కులను కలిగి ఉండాలి. అదనంగా NCVT/SCVT జారీ చేసిన నిర్దేశిత ట్రైడ్ లో జాతీయ TED సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

3). వయసు : అభ్యర్థులు ఈ పోస్టు దరఖాస్తు చేసుకోవడానికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

4). దరఖాస్తు ఫీజు : అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100 చెల్లించాలి SC/ST/PWBD /మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

5). దరఖాస్తు ఎలా చేయాలంటే : అభ్యర్థులు దరఖాస్తు ను ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ మే 10 వ తేదీ నిర్ణయించడం జరిగింది.

6). అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://er.indianrailways.gov.in/ లో పూర్తి సమాచారాన్ని చదివి అప్లై చేసుకోవాలి.

ఇక అందరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.