Health Benefits : మల్బరీతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా.!?

Health Benefits : మల్బరీ చెట్టు పట్టు పురుగులకు ఆహారం. ఈ చెట్టు ఆకులు, బెరడు, పండ్లు అన్నింటిలో ఔషధ గుణాలు ఉన్నాయి.. వీటిలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఏ, బి, సి ఉన్నాయి.. ఇక మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్, జింక్ సమృద్ధిగా లభిస్తాయి.. ఆయుర్వేద వైద్యంలో మల్బరీ చెట్టును పూర్వ కాలం నుంచి ఉపయోగిస్తున్నారు.. ఏ ఏ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందంటే..!?

మల్బరీ పండ్లు తింటే వాటిలోని ఆల్కలాయిడ్స్ వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి హానికర బ్యాక్టీరియా, వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. మల్బరీ పండ్లు తీసుకోవడం వలన రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం ఉంది ఈ పండ్లలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది.

health benefits of Mulberry Plant
health benefits of Mulberry Plant

తరుచుగా ఈ పండ్లు తింటే కళ్లకు మేలు చేస్తుంది. కంటి రెటినాను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ఈ పండ్లలో ఉండే కాల్షియం ఎముకల కణజాలాన్ని బలంగా ఏర్పాటు చేస్తుంది. కాలేయ సమస్యలను నివారిస్తుంది.‌